న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ 20 పెట్రోల్ వల్ల మధ్యతరగతి ప్రజలపై ఇంధన భారం పెరగడమే కాకుండా, వారి వెహికల్స్ దెబ్బతింటున్నాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ఆరోపించారు. వినియోగదారులకు వేరే ప్రత్యామ్నాయం లేకుండా చేసి, ఇథనాల్ ఉత్పత్తిదారులకు మాత్రమే లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని బుధవారం సోషల్ మీడియాలో మండిపడ్డారు. మార్చి 2025 నుంచి సాధారణ పెట్రోల్ బంకుల్లో కేవలం ఈ20 పెట్రోల్ మాత్రమే లభ్యమవుతోందన్నారు. దీని వల్ల వెహికల్స్ మైలేజీ భారీగా తగ్గిందని ఒక సర్వే వెల్లడించిందని ఆయన గుర్తుచేశారు.
