మానవత్వం చాటిన మనుషులు.. చనిపోయిన కోతులకు అంతిమ సంస్కరాలు

మానవత్వం చాటిన మనుషులు.. చనిపోయిన కోతులకు అంతిమ సంస్కరాలు

మానవత్వం ఇంకా బతికి ఉందనడానికి ఇదొక ఉదాహరణ. మనుషులు చనిపోతేనే పట్టించుకోకుండా పక్కనుంచి పోతున్న ఈ రోజుల్లో..  కోతులు చనిపోతే  అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు పెద్దపల్లి జిల్లా సుల్తానా బాద్ ప్రజలు.  ప్రమాదవ శాత్తు చనిపోయిన నాలుగు కోతులకు ఘనంగా అంత్యక్రియలునిర్వహించారు. మనిషి చనిపోతే  ఏవిధంగా అంతిమ సంస్కరాలు చేస్తారో అదేవిధంగా కోతులకు చేసి అందరి ప్రశంసలు అందుకున్నారు. వివరాల్లోకి వెళితే.. 

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని 12వ వార్డులో రాజీవ్ రహదారిపై బుధవారం(ఆగస్టు5) రోడ్డు దాటుతున్న కోతులను కారు ఢీకొట్టడంతో 5 కోతులు చనిపోయాయి. మరో రెండు కోతులు తీవ్రంగా గాయపడ్డాయి. చనిపోయిన కోతులకు వార్డు కౌన్సిలర్ శ్రావణి ఆధ్వర్యంలో అంతిమ సంస్కారాలను ఘనంగా నిర్వహించారు. 

అర్చకులతో శాస్త్రబద్ధంగా పూజలు నిర్వహించి డప్పు చప్పులతో అంతిమయాత్ర జరిపారు. అనంతరం శ్మశానవాటికలో వాటిని పూడ్చిపెట్టారు. కాంగ్రెస్ లీడర్లు ఆమిరిశెట్టి  తిరుపతి, రాజలింగం, సందీప్, రమేశ్‌‌‌‌‌‌‌‌, ఆంజనేయులు, సాగర్, సాయి, కుమార్ స్వామి, సదానందం పాల్గొన్నారు.