జగిత్యాల టౌన్, వెలుగు : గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచించారు. పుష్కర ఏర్పాట్లపై సోమవారం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్‌లతో కలిసి కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ధర్మపురి, కోటిలింగాల తదితర పుష్కర ఘాట్ల వద్ద అవసరమైన మౌలిక వసతుల పనులను పూర్తి చేయాలన్నారు.
ధర్మపురి పుష్కర ప్రాంతం అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.226.41 కోట్లు కేటాయించిందని తెలిపారు. రహదారులు, తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్, భద్రత తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్, మెట్‌పల్లి ఆర్డీవో నరసింహరావు, ధర్మపురి మున్సిపల్ చైర్‌పర్సన్ నాగలక్ష్మి పాల్గొన్నారు.
