జెన్ జీ 4 రోజుల ఉద్యమానికి దిగి వచ్చిన జార్ఖండ్ సీఎం..

జెన్ జీ 4 రోజుల ఉద్యమానికి దిగి వచ్చిన జార్ఖండ్ సీఎం..

జార్ఖంగ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ జెజ్ జీ చేస్తున్న ఉద్యమానికి ప్రభుత్వం దిగివచ్చింది. బుధవారం (ఆగస్టు 05)  జెన్ జీ ఉద్యమకారులతో చర్చలకు ఓకే చెప్పారు ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సోరేన్. జులై 25 నుంచి కొనసాగుతున్న ఉద్యమానికి తలొగ్గని ప్రభుత్వం.. విద్యార్థి నాయకుడు దేవేంద్ర నాథ్ మహతో ఆమరణ దీక్షతో.. కేవలం నాలుగు రోజులకే దిగొచ్చింది. విద్యార్థులతో చర్చలకు సిద్ధమని ప్రకటించింది. 

స్టూడెంట్స్ డిమాండ్స్:

14వ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల ఫలితాలు వెల్లడైన జులై 5వ తేదీ తర్వాత.. జార్ఖండ్ లో జెన్ జీ ఉద్యమకారులు ఆందోళనకు దిగారు. పరీక్షల్లో అక్రమాలు జరిగాయని.. రద్దు చేసి సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా భారీ ఎత్తున ఆందోళన చేస్తున్నారు. జార్ఖండ్ వాంగ్ చుక్ గా పేరు తెచ్చుకున్న జార్ఖండ్ లోక్ తంత్రిక్ క్రాంతికార్ మోర్చా విద్యార్థి సంఘం నాయకుడు దేవేంద్ర నాథ్ మహతో ఆమరణ దీక్షతో ఉద్యమం ఉధృతంగా మారింది. 

జెన్ జీ ఉద్యమంపై జార్ఖండ్ ముక్తి మోర్చా జనరల్ సెక్రటరీ, వినోద్ పాండే మాట్లాడుతూ.. ప్రభుత్వం ఒకటి రెండు రోజుల్లో హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ఎవిడెన్స్ ఆధారంగా చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. 

జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్షలు రద్దు చేయడం, సీబీఐ విచారణ, సింగిల్ జడ్జితో కమిటీ, JPSC, JSSC సంస్కరణలు మొదలైనవి విద్యార్థులు పెట్టిన ముఖ్యమైన డిమాండ్లు.

కాక్రోచ్ పార్టీ మద్ధతు:

మరోవైపు జార్ఖండ్ లో జెన్ జీ జరుపుతున్న ఉద్యమానికి మద్ధతు తెలిపిన కాక్రోచ్ జనతా పార్టీ.. త్వరలో ఉద్యమంలో పాల్గొంటామని ప్రకటించడం కీలకంగా మారింది. జార్ఖండ్ వెళ్లి ఉద్యమంలో పాల్గొంటామని బుధవారం (ఆగస్టు 05) మీడియాతో వెల్లడించారు. జులై 29 నుంచి రాంచిలోని జైపాల్ సింగ్ ముండా స్టేడియంలో విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో అవకతవకలపై వారు చేస్తున్న పోరాటంలో న్యాయం ఉంది. రిటైర్డ్ హైకోర్టు జడ్జి ఆధ్వర్యంలో కమిటీ వేయాలి.. ఆ ఉద్యమంలో తాము కూడా పాల్గొంటామని ప్రకటించడం కీలకంగా మారింది.

జార్ఖండ్ ప్రభుత్వాన్ని ఒప్పించిన కాంగ్రెస్:

నీట్ వ్యవహారంలో కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమానికి మద్ధతు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. జార్ఖండ్ లో కూటమి ప్రభుత్వం విషయంలో కీలకంగా వ్యవహరించింది. సమస్య పరిష్కారం దిశగా చర్చలు జరిపింది.  ఉద్యమం ఉధృతంగా మారుతున్న క్రమంలో విద్యార్థులతో చర్చలు జరపాలని కాంగ్రెస్ పార్టీ జేఎంఎం ప్రభుత్వాన్ని సూచించింది. సిట్టింగ్ జడ్జీతో ప్యానెల్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత అజోయ్ కుమర్ జార్ఖండ్ ప్రభుత్వానికి సూచించారు. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC) అధికారులను డిస్మిస్ చేసి.. రిజల్స్ట్ క్యాన్సిల్ చేయాల్సిందిగా సూచించారు. దీంతో హేమంత్ సోరేన్ ప్రభుత్వం విద్యార్థులతో చర్చలు జరిపేందుకు అంగీకరించింది.