కరికాల యోధుడిగా సందీప్ కిషన్

కరికాల యోధుడిగా  సందీప్ కిషన్

 సందీప్ కిషన్ హీరోగా ఓ ఫాంటసీ అడ్వంచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూవీ తెరకెక్కుతోంది.  ‘శంబాల’తో మెప్పించిన యుగంధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముని ఈ పాన్ ఇండియా మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మిస్తున్నారు.  

బుధవారం టైటిల్‌‌‌‌‌‌‌‌తో పాటు ఫస్ట్ లుక్‌‌‌‌‌‌‌‌ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘కరికాల’ అనే పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌ టైటిల్‌‌‌‌‌‌‌‌ను ఖరారు చేశారు. పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రాజసం ఉట్టిపడుతున్న యోధుడి గెటప్‌‌‌‌‌‌‌‌లో సందీప్‌‌‌‌‌‌‌‌ కిషన్ కనిపించాడు. దట్టమైన అడవిలో గుర్రంపై దూసుకెళ్తుండగా, తనకు సమాంతరంగా సింహం పరుగెడుతున్న పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంప్రెస్ చేస్తోంది.  

టైటిల్, ఫస్ట్‌‌‌‌‌‌‌‌ లుక్‌‌‌‌‌‌‌‌ను బట్టి జానపద కథల తరహా ఫాంటసీ ఎలిమెంట్స్‌‌‌‌‌‌‌‌తో కూడిన యాక్షన్‌‌‌‌‌‌‌‌ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇదని అర్థమవుతోంది. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుందని, ఫస్ట్ పార్ట్‌‌‌‌‌‌‌‌ని 2027 జులై 2న, సెకండ్ పార్ట్‌‌‌‌‌‌‌‌ని అదే ఏడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 28న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్‌‌‌‌‌‌‌‌ ప్రకటించారు.  శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇతర నటీనటులు, టెక్నీషియన్స్‌‌‌‌‌‌‌‌ వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.