నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కాక్రోచ్ జనతా పార్టీ, విద్యార్థుల ఆందోళనలకు మద్ధతుగా 26 రోజులు ఆమరణ దీక్ష చేసిన హక్కుల కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీక్ష విరమణ విషయంలో కేంద్ర మంత్రులు నమ్మక ద్రోహం చేశారని ఆరోపించారు. దీక్ష విరమణ ఫోటోలు విడుదల చేయమని చెప్పి.. సోషల్ మీడియాలో రిలీజ్ చేశారని అన్నారు.
ఇండియా టుడే కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్ దీప్ సర్దేశాయ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. అర్థరాత్రి ఆమరణ దీక్ష విరమణకు సంబంధించి ఫోటులు విడుదల చేయొద్దని కొరినట్లు చెప్పారు. దానికి కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ మాటఇచ్చినట్లు తెలిపారు. తను విపక్ష నేతల, విద్యార్థుల సమక్షంలో దీక్ష విరమించాలని అనుకున్నట్లు చెప్పారు. అప్పటి వరకు ఫోటోలు రిలీజ్ చేయవద్దని తన డిమాండ్ కు అంగీకరించిన మంత్రులు.. మాట తప్పారని.. ఫోటోలు రిలీజ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
నిరసనకారుల డిమాండ్లను అంగీకరించిన తర్వాత, నిరాహార దీక్షను విరమించడానికి ప్రభుత్వ ప్రతినిధులు జ్యూస్ లేదా సూప్ అందించడం ఆనవాయితీ అని లడఖ్‌లో అన్నారు. అయితే, దీన్ని కేవలం అధికార పార్టీకి ప్లస్ అయ్యేలా చిత్రీకరించారని నొక్కి చెప్పారు. ఫోటోలు విడుదల చేయమని మంత్రులు చెప్పగా.. దానికి సీనియర్ ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) అధికారులే సాక్షులు అని అన్నారు.
ఈ ఒప్పందానికి మీరే సాక్షులు. అన్ని పార్టీల ప్రతినిధుల సమక్షంలో నేను ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే వరకు ఎవరూ మీడియాకు ఎలాంటి చిత్రాలను విడుదల చేయకూడదు.. అని ఐబీ అధికారులతో అన్నాను.. వారు దానికి అంగీకరించి, మాట ఇచ్చారు అని చెప్పారు. కానీ కొన్ని నిమిషాల గ్యాప్ లోనే ఒప్పందాన్ని ఉల్లంఘించారని వాంగ్‌చుక్ పేర్కొన్నారు.
నిరాహార దీక్ష విషయంలో కేంద్రంతో ఒప్పందం చేసుకున్నారన్న ఆరోపణలను తోసిపుచ్చారు. అలా ఒప్పందం చేసుకుని ఉంటే.. 26 రోజుల పాటు నిరాహార దీక్ష చేయాల్సిన అవసరం ఉండేది కాదు. ఒప్పందాలు చేసుకోవాలని అనుకుంటే, నాకు చాలా అవకాశాలు ఉండేవి,అని ఆయన అన్నారు.
నీట్ (NEET) అంశంపై అభిజీత్ దిప్కే నేతృత్వంలోని 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) చేపట్టిన నిరసనలో వాంగ్‌చుక్ పాల్గొన్నారు. జూన్ 28న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తన నిరాహార దీక్షను ప్రారంభించారు. ఆరోగ్యం క్షీణించడంతో, జూలై 18న పోలీసులు ఆయనను బలవంతంగా గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రికి తరలించారు. తన ఇష్టానికి వ్యతిరేకంగా తరలించారని ఆరోపిస్తూ విద్యార్థులు దీనిపై నిరసన వ్యక్తం చేశారు.
