వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పీవీ సింధుకు సులువైన డ్రా

వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పీవీ సింధుకు సులువైన డ్రా

న్యూఢిల్లీ:  వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాడ్మింటన్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో స్టార్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ పీవీ సింధుకు సులువైన డ్రా ఎదురైంది. తొలి రౌండ్‌‌‌‌‌‌‌‌లో ఆమె.. సోఫియా నోబెల్‌‌‌‌‌‌‌‌ (ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌)తో తలపడనుంది. పతక రౌండ్లకు ముందు సింధు.. వరల్డ్‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌వన్‌‌‌‌‌‌‌‌ ఆన్‌‌‌‌‌‌‌‌ సే యంగ్‌‌‌‌‌‌‌‌ (కొరియా), అకానె యమగుచి (జపాన్‌‌‌‌‌‌‌‌) వంటి టాప్‌‌‌‌‌‌‌‌ స్టార్లతో తలపడే అవకాశం లేదు. యంగ్‌‌‌‌‌‌‌‌తో పాటు ఒకే అర్ధభాగంలో ఉన్నప్పటికీ ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో సింధు.. వాంగ్ జి యి (చైనా)ను, క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో పుత్రి వార్దానీ (ఇండోనేసియా)తో తలపడే చాన్స్‌‌‌‌‌‌‌‌ ఉంది.

మెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌లో లక్ష్యసేన్‌‌‌‌‌‌‌‌.. కొలిన్స్‌‌‌‌‌‌‌‌ వాలంటైన్‌‌‌‌‌‌‌‌ (ఆస్ట్రియా)ను ఎదుర్కోనున్నాడు. ఆసియా చాంపియన్‌‌‌‌‌‌‌‌ రజత విజేత ఆయుశ్‌‌‌‌‌‌‌‌ షెట్టి తొలి రౌండ్‌‌‌‌‌‌‌‌లో డిఫెండింగ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌ షి యుకి (చైనా)తో తలపడనున్నాడు. డబుల్స్‌‌‌‌‌‌‌‌లో ఐదోసీడ్‌‌‌‌‌‌‌‌ సాత్విక్‌‌‌‌‌‌‌‌ సాయిరాజ్‌‌‌‌‌‌‌‌–చిరాగ్‌‌‌‌‌‌‌‌ షెట్టి జోడీకి తొలి రౌండ్‌‌‌‌‌‌‌‌లో బై లభించింది. రెండో రౌండ్‌‌‌‌‌‌‌‌లో ఇండియా ద్వయం అలెగ్జాండర్‌‌‌‌‌‌‌‌ డున్‌‌‌‌‌‌‌‌–ఆడమ్‌‌‌‌‌‌‌‌ ప్రింగిల్స్‌‌‌‌‌‌‌‌ (స్కాట్లాండ్‌‌‌‌‌‌‌‌) లేదా థాయ్‌‌‌‌‌‌‌‌లాండ్‌‌‌‌‌‌‌‌కు చెందిన చలోఎంపాన్ చారోఎంకిటామోర్న్ మరియు వోరాపోల్ థోంగ్స్‌‌‌‌‌‌‌‌నాతో తలపడతారు. మెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్ డ్రా చాలా ఓపెన్‌‌‌‌‌‌‌‌గా ఉందని, ఆయుష్ లేదా లక్ష్యసేన్‌‌‌‌‌‌‌‌ పతకం సాధించే అవకాశం ఉందని చీఫ్ కోచ్ గోపీచంద్ ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 17 నుంచి 23 వరకు పోటీలు జరగనున్నాయి.