మోదీ రెండు దశాబ్దాల ప్రజాదరణకు రెండు వారాల్లో దెబ్బ

మోదీ రెండు దశాబ్దాల ప్రజాదరణకు రెండు వారాల్లో దెబ్బ
  • సీజేపీ నిరసనలపై ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్ వ్యాఖ్య

న్యూఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద  కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో జరిగిన నిరసనలు ప్రధాని నరేంద్ర మోదీకి దశాబ్దాలుగా ఉన్న ప్రజాదరణను కేవలం రెండు వారాల్లోనే దెబ్బతీశాయని ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్ వ్యాఖ్యానించారు. ఈ పరిణామం ఎన్నికల విజయం కంటే పెద్ద రాజకీయ దెబ్బ అని ఆమె పేర్కొన్నారు. అరుంధతీరాయ్ తన పుస్తకం ‘మదర్ మేరీ కమ్స్ టు మీ’ హిందీ అనువాదం ‘మేరీ మా, మేరీ గ్యాంగ్‌‌‌‌స్టర్’ ను  ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్‌‌‌‌‌‌‌‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.

‘‘కోట్లాది రూపాయలు వెచ్చించి, పత్రికా సమావేశాలు కూడా పెట్టకుండా, విష్ణుమూర్తి అవతారంగా అభివర్ణించుకుంటూ 24 ఏండ్లుగా ప్రధాని మోదీ నిర్మించుకున్న ఇమేజ్‌‌‌‌ను రెండు వారాల వ్యవధిలోనే ఈ నిరసనలు కుదిపేశాయి. ఇది ఎన్నికల విజయం కంటే గొప్పది” అని ఆమె పేర్కొన్నారు. దశాబ్దాలుగా నిర్మించిన కథనాలను కూడా కేవలం రెండు వారాల ప్రజా సమీకరణ ద్వారా మార్చేయవచ్చని నిరూపితమైందన్నారు. అయితే, సవాళ్లు ఇంకా ముగిసిపోలేదని అరుంధతీ రాయ్ హెచ్చరించారు. జంతర్ మంతర్ నిరసనకారుల నుంచి ప్రతిపక్షాలు పాఠాలు నేర్చుకోవాలని, విభిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ వారు చూపిన పరిణతి ప్రశంసనీయమన్నారు.