మహబూబ్నగర్: పాము కాదు.. చేపే

మహబూబ్నగర్: పాము కాదు.. చేపే

మహబూబ్​నగర్​ జిల్లా కోయిలకొండ మండలం కోయిల్​సాగర్​ ప్రాజెక్టులో మంగళవారం ఓ మత్స్యకారుడికి పాము లాంటి చేప చిక్కింది. అతని వద్ద నారాయపేట జిల్లా మరికల్ కు చెందిన శేఖర్​ అనే వ్యాపారి కొని మార్కెట్​లో అమ్మేందుకు తీసుకొచ్చాడు. ​9 కిలోల బరువు ఉన్న పాము లాంటి చేపను  మలుగుమియా చేపగా పిలుస్తారు. ఈ చేపను స్థానికులు ఆసక్తిగా తిలకించారు. 

-మరికల్, వెలుగు