నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ నగరంలో మంగళవారం సాయంత్రం ఆరె కటిక సంఘం ఆధ్వర్యంలోని బోనాలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని మొక్కుకున్నారు. మీడియాతో మాట్లాతూ తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలకు బోనాల పండగ ప్రతీక అన్నారు.
అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యానారాయణ, మేయర్ ఉమారాణి, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, డీసీసీ ప్రెసిడెంట్‌నగేశ్ రెడ్డి, నుడా చైర్మన్ కేశవేణు, శేఖర్ గౌడ్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
