ఆర్మూర్, వెలుగు: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గానికి తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్, కాలేజీలు మంజూరు చేయాలని ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి బుధవారం మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్‌ను కోరారు.
బుధవారం హైదరాబాద్ సెక్రటేరియల్‌లో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. మైనార్టీల అభివృద్ధికి, సంక్షేమ పథకాలకు నిధులు ఇవ్వాలని కోరారు. స్పందించిన మంత్రి త్వరలోనే నిధుల మంజూరుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు.
