UPI ఛార్జీలతో ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం‌లకు రూ.8వేల 500 కోట్లు లాభం!

UPI ఛార్జీలతో ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం‌లకు రూ.8వేల 500 కోట్లు లాభం!

UPI చెల్లింపులపై మోడీ ప్రభుత్వం తీసుకున్న కొత్త ఛార్జీల నిర్ణయం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సెప్టెంబర్ 15న ప్రభుత్వం యూపీఐ చెల్లింపులపై ఛార్జీలను స్టార్ట్ చేస్తోంది. వ్యాపార సంఘాలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ.. దీనివల్ల పేమెంట్ కంపెనీలకు మాత్రం భారీగా లాభాలు రానున్నాయి.

ప్రభుత్వ నిర్ణయం ప్రకారం రూ.2వేల కంటే ఎక్కువ విలువైన యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం మర్చంట్ ఫీజు పడనుంది. దాదాపు 6 సంవత్సరాల తర్వాత యూపీఐపై మర్చంట్ ఫీజు మళ్లీ అమలులోకి రావటం అటు వ్యాపారులను, ఇటు ప్రజలను ఇబ్బందులకు గురిచేయనుంది. ఇప్పటివరకు యూపీఐ ద్వారా డబ్బులు చెల్లిస్తే షాప్‌ యజమానుల నుంచి ఎలాంటి ఎక్స్‌ట్రా ఛార్జీలు వసూలు చేసేవారు కాదు.

మార్చి 2028 నాటికి ఈ కొత్త యూపీఐ ఫీజు ద్వారా పేమెంట్ యాప్‌లకు ఏటా సుమారు 1.1 బిలియన్ డాలర్ల అదనపు ఆదాయం రావచ్చని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ 'బెర్న్‌స్టెయిన్' పేర్కొంది.  ఇది మన భారతీయ కరెన్సీలో దాదాపు రూ.10వేల 450 కోట్లకు సమానం. ఇందులో ప్రధానంగా ఫోన్‌పే, గూగుల్ పే వాటాయే దాదాపు 900 మిలియన్ డాలర్లు ఉండొచ్చు. అంటే ఇది సుమారు రూ.8వేల550 కోట్లు అన్నమాట. 

ప్రస్తుతం మార్కెట్‌లో వాల్‌మార్ట్ మద్దతు ఉన్న ఫోన్‌పే, గూగుల్ పే సంయుక్తంగా 80% యూపీఐ లావాదేవీలను నిర్వహిస్తున్నాయి. ఈ విపరీతమైన లాభాలతో ఆ కంపెనీలు టెక్నాలజీని మెరుగుపరచడంతో పాటు, చిన్న పట్టణాలు, గ్రామాల్లో తమ సర్వీస్‌లను మరింత విస్తరించడానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది.

ALSO READ : ఈ 2 పెట్రోల్ బంకుల్లో డీజిల్ పై ఆంక్షలు.. 

కస్టమర్లపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
ఈ అదనపు ఖర్చు భారాన్ని పరోక్షంగానైనా షాపు యజమానులు కస్టమర్లపై మోపుతారనేది వాస్తవం. అయితే రోజువారీ అవసరాల కోసం ప్రజలు యూపీఐ చెల్లింపులకు పూర్తిగా అలవాటు పడిపోయారు. అందువల్ల కేవలం ఈ ఛార్జీల వల్ల మళ్లీ అందరూ ఫిజికల్ క్యాష్ వాడకం మొదలుపెట్టే అవకాశం ఉందనేది నిపుణుల మాట. ఇప్పటికే దీనిని నిరశిస్తూ వ్యాపార వర్గాలు అక్టోబర్ 2న నో యూపీఐ డే పేరుతో డిజిటల్ చెల్లింపుల స్వీకరణను బంద్ పెట్టాయి. రానున్న రోజుల్లో వ్యాపారులు పెట్టే ఆంక్షలు ప్రజలను తిరిగి క్యాష్ ఎకానమీ దిశగా నడిపిస్తాయనేది ఒప్పుకోవాల్సిన నిజం.