నిజామాబాద్, వెలుగు: సర్ లిస్ట్‌లో లోపాలను సరిదిద్దేందుకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని నిజామాబాద్ కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ నిర్ణీత గడువులోగా సర్ ప్రక్రియను కంప్లీట్ చేయాలన్నారు. అక్టోబర్ 1 నుంచి వానాకాలం సీజన్ వడ్ల కొనుగోళ్లను ప్రారంభించాలన్నారు. లోటుపాట్లకు తావులేకుండా ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. వారం రోజుల్లో భూభారతి అర్జీలు క్లియర్ చేయాలన్నారు.
డబుల్ బెడ్ ఇండ్ల కేటాయింపునకు అర్హుల జాబితా సిద్ధం చేసి లాటరీ ద్వారా లబ్ధిదారులను కేటాయించాలన్నారు. అంతకుముందు కలెక్టరేట్ పక్కనున్న ఐటీ టవర్‌ను కలెక్టర్ సందర్శించారు. జిల్లా యూత్‌కు ఉద్యోగ అవకాశాలు లభించేలా చూడాలని జోనల్ మేనేజర్ శివప్రసాద్‌కు సూచించారు. అడిషనల్ కలెక్టర్ భుజంగరావు, ట్రైనీ కలెక్టర్ సురేశ్, డీఆర్‌వో గీత, మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్, ఆర్డీవోలు రాజేంద్రకుమార్, విజయకుమారి, డీఆర్డీవో సాయన్న తదితరులు ఉన్నారు.
