శివసేనలో రాజకీయ ప్రకంపనలు : షిండే సేనలో చేరుతున్నా ఎంపీ నగేశ్‌‌ పాటిల్ అస్తికార్

శివసేనలో రాజకీయ ప్రకంపనలు : షిండే సేనలో చేరుతున్నా ఎంపీ నగేశ్‌‌ పాటిల్ అస్తికార్

ముంబై: శివసేన (యూబీటీ)లో రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. కొన్ని రోజులు గా సాగుతున్న ఊహాగానాలకు తెరదించుతూ, తాను ఏకనాథ్ షిండే నేతృత్వంలోని అసలు శివసేనలో చేరుతున్నట్టు తిరుగుబాటు ఎంపీ నగేశ్‌‌ పాటిల్ అస్తికార్ ఆదివారం స్పష్టం చేశారు. 

జూన్ 18 తర్వాత తమపై కొందరు నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే ఉద్ధవ్ థాక్రే వర్గాన్ని వీడేలా చేశాయని ఆయన వెల్లడించారు. మరోవైపు, నియోజకవర్గ అభివృద్ధి నిధుల కొరత, ప్రతిపక్షంలో ఉండటం వల్ల ఎదురవుతున్న పరిమితులే తన నిర్ణయానికి ప్రధాన కారణాలని పేర్కొన్నారు.

  సంజయ్ రౌత్ చేసిన హెచ్చరికలపై అస్తికార్ స్పందిస్తూ.. ‘‘ఆయన మాకు తండ్రి లాంటి వారు.. మమ్మల్ని మందలించే హక్కు ఉంది. కానీ ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పే సామర్థ్యం ఉంటుందని గ్రహించాలి’’ అని హితవు పలికారు.