రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి..గాంధీ సరోవర్ శంకుస్థాపనకు రావాలని ఆహ్వానం

రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి..గాంధీ సరోవర్ శంకుస్థాపనకు రావాలని ఆహ్వానం

న్యూఢిల్లీ: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా  గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపనకు రావాలని కేంద్ర మంత్రిని ఆహ్వానించారు. ఢిల్లీలోని మంత్రి నివాసంలో ఆయనను  కలిసిన వారిలో సీఎం రేవంత్ రెడ్డి తోపాటు ఎంపీలు మల్లు రవి, గడ్డం వంశీకృష్ణ, కడియం కావ్య, అనిల్ కుమార్  యాదవ్ లు ఉన్నారు. 

ఫిబ్రవరి చివరి వారంలో గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపన ఉంటుందని రాజ్ నాథ్ సింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈసా, మూసీనదుల సంగమ స్థలంలో కార్యక్రమం చేపడుతున్నట్లు మంత్రికి వివరించారు. ఈ ప్రాంతానికి  ప్రత్యేకత ఉందన్నారు. 1948లో  మహాత్ముని చితాభస్మాన్ని ఈసా మూసీ సంగమ స్థలిలో నిమజ్జనం చేశారని తెలిపారు. 

మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా  గాంధీ సరోవర్ ప్రాజెక్టును చేపడుతున్నట్లు తెలిపారు. బాపూ ఘాట్ ను ప్రపంచ స్థాయి విద్యా, సాంస్కృతిక , ఆధ్యాత్మిక  , పర్యావరన చిహ్నంగా తీర్చిదిద్దనున్నట్లు కేంద్ర మంత్రికి సీఎం తెలిపారు.