ఏ దేశమేగినా.. : అమెరికాలో మోస్ట్ క్రిమినల్స్ జాబితాలో 21 మంది గుజరాతీయులు

ఏ దేశమేగినా.. : అమెరికాలో మోస్ట్ క్రిమినల్స్ జాబితాలో 21 మంది గుజరాతీయులు

చెత్త.. అత్యంత చెత్త మనుషులను దేశం నుంచి తరిమికొట్టాలని.. దేశం నుంచి వెలివేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం తర్వాత.. ఘోరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ట్రంప్ ఆదేశాలతో అమెరికాలో అత్యంత క్రిమినల్స్ డేటా విడుదల చేసింది DHS.. డీహెచ్ఎస్ అంటే అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ వింగ్.. అదే విధంగా ICE.. అంటే అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ డిపార్ట్ మెంట్. దేశాల వారీగా అత్యంత ఘోరమైన నేరాలు చేసిన వాళ్లు వివరాలు వెల్లడించింది. 

ఇండియా నుంచి అమెరికా వెళ్లి.. ఆ దేశం గడ్డపై అత్యంత ఘోరమైన నేరాలు చేసిన వాళ్లు 89 మంది ఉన్నారని DHS, ICE విడుదల చేసిన డేటా స్పష్టం చేసింది. 89 మంది భారతీయ క్రిమినల్స్ లో 21 మంది గుజరాతీయులే ఉండటం విశేషం. ఫిబ్రవరి 7వ తేదీన రిలీజ్ అయిన ఈ డేటా.. అమెరికాలో అక్రమ వలసల చీకటి కోణాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. 

అత్యంత ఘోరమైన నేరాలు చేసిన 89 మంది భారతీయులపై మోపబడిన నేరాలు చిట్టా సైతం విడుదల చేశారు అమెరికా అధికారులు. వీళ్లందరూ డ్రగ్స్ అక్రమ రవాణా, పిల్లలతో లైంగిక నేరాలు, మనీ లాండరింగ్, ఆర్థిక నేరాలు, అక్రమంగా డబ్బులు తరలింపు, దొంగతనాలు, దోపిడీలు, గృహ హింస, దొంగలు కొట్టేసిన వస్తువులను అమ్మటం వంటి తీవ్ర నేరాలకు పాల్పడినట్లు వెల్లడిస్తుంది ఈ డేటా. 

Also Read : ఎట్టకేలకు వేల కోట్ల పొగాకు వ్యాపారి కొడుకు అరెస్ట్

ఈ 89 మంది భారతీయ క్రిమినల్స్ లో 21 మంది గుజరాత్ రాష్ట్రం నుంచి వెళ్లిన వాళ్లే ఉన్నారు. వీళ్లు ఎక్కువగా ఇమ్మిగ్రేషన్ మోసాలు, అక్రమంగా నిధుల తరలింపు, ఫోన్ స్కాంలు, తప్పుడు ప్రకటనలతో మోసం చేయటం, మనీ లాండరింగ్, లైంగిక వేధింపులు, సైబర్ నేరాలు వంటివి ఉన్నాయని ICE, DHS ప్రకటించింది. ఇవన్నీ వ్యక్తిగతంగా కాకుండా పెద్ద నెట్ వర్క్ ఏర్పాటు చేసుకుని.. మోసం చేయాలనే ఉద్దేశంతో ఈ నేరాలు, ఘోరాలు చేసినట్లు అమెరికా సెక్యూరిటీ డిపాప్ట్ మెంట్ ప్రకటించటం విశేషం. 

ఇలాంటి వాళ్లకు కఠిన శిక్షలతోపాటు శిక్ష పూర్తయిన తర్వాత అమెరికా నుంచి వెళ్లగొట్టే ఆలోచన చేస్తుంది అమెరికా. విదేశాల నుంచి అమెరికా వచ్చి ఘోరమైన నేరాలు చేసే వాళ్లను జీవితాంతం శిక్షలు విధించాలనే కఠిన చర్యలకు ఆయా సెక్యూరిటీ డిపార్ట్ మెంట్స్ ఆలోచన చేస్తోంది. 89 మంది భారతీయుల్లో 21 మంది గుజరాత్ రాష్ట్రం నుంచి వెళ్లిన వాళ్లే ఉండటం విశేషం.