పతంజలి టూత్ పేస్ట్, ఫేస్ వాష్, నెయ్యి, సబ్బులు.. ఇలా రామ్ దేవ్ బాబా కంపెనీకి చెందిన ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ గురించి తెలిసే ఉంటుంది. దేశీ ఆయుర్వేదిక్ ఉత్పత్తులు అమ్ముకునే పతంజలి.. ఇప్పుడు ఇన్సూరెన్స్ రంగంలోకి అడుగుపెట్టింది. త్వరలోనే ఇన్సూరెన్స్ పాలసీలు అమ్ముకోనుంది. అందుకు సంబంధించి ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీ మాగ్మా జనరల్ ఇన్సూరెన్స్ ను కొనుగోలు చేసేందుకు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) ఆమోదం తెలిపింది. దీంతో వేగంగా అభివృద్ధి చెందుతున్న జనరల్ ఇన్సూరెన్స్ మార్కెట్‌లోకి పతంజలి ఎంట్రీకి లైన్ క్రియర్ అయ్యింది.
ఆహారం, మిఠాయి వ్యాపారాలకు ప్రసిద్ధి చెందిన డీఎస్ గ్రూప్‌తో కలిసి దాదాపు రూ. 4,500 కోట్ల విలువైన వాటాను కొనుగోలు చేయనుంది. ఈ ఒప్పందం ప్రకారం, పతంజలి ఆయుర్వేద్ మాగ్మా జనరల్ ఇన్సూరెన్స్‌లో 73.56 శాతం వాటాను కొనుగోలు చేయగా.. డీఎస్ గ్రూప్ 24.5 శాతం వాటాను దక్కించుకుంటుంది.
►ALSO READ | ఫెడ్ వడ్డీ రేట్ల ఎఫెక్ట్: స్టాక్ మార్కెట్ చివరి క్షణాల్లో మ్యాజిక్.. వరుసగా రెండో రోజు లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ..
IRDAI ఆమోదం మూడు నెలల వరకు ఉంటుంది, ఈ లోగా డీల్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ కొనుగోలుతో పతంజలి ఫినాన్స్ సెక్టార్ లోకి తొలిసారిగా పెద్ద ఎత్తున అడుగుపెట్టింది. ఇప్పటివరకు, ఈ కంపెనీ ప్రధానంగా ఆయుర్వేద మందులు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఇతర వస్తువులను అమ్ముతూ వస్తుండేది.
ఇన్సూరెన్స్ రంగంలోకి అడుగేయాలనుకున్న పతంజలి.. ఇన్సురెన్స్ కోసం కొత్త లైసెన్స్ రే అప్లై చేసుకోకుండా.. మోటార్, హెల్త్, ప్రాపర్టీ, కమర్షియల్ రంగాలలో విజయవంతంగా నడుస్తున్న ఒక బీమా సంస్థను కొనుగోలు చేసి ఇన్సురెన్స్ సెక్టార్ లోకి ఎంట్రీ ఇచ్చింది పతంజలి.
మాగ్మా జనరల్ ఇన్సురెన్స్ గురించి
మాగ్మా జనరల్ ఇన్సూరెన్స్ ఇటీవలి కాలంలో వ్యాపారాన్ని క్రమంగా విస్తరిస్తూ వస్తోంది. FY26లో రూ. 3,615.48 కోట్ల ప్రీమియంలను ఇచ్చినట్లు పేర్కొంది. గత ఆర్థిక సం. రూ. 3,334.4 మాత్రమే ఉన్న విషయం ప్రీమియం..అంత మేరకు పెరగటం విశేషం.
