‘గోమూత్ర నిపుణుడు’అని హేళన చేస్తారా?..ప్రియాంక వ్యాఖ్యలపై విద్యావేత్తల ఫైర్

‘గోమూత్ర నిపుణుడు’అని  హేళన చేస్తారా?..ప్రియాంక వ్యాఖ్యలపై విద్యావేత్తల ఫైర్

న్యూఢిల్లీ: ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటిని ఉద్దేశించి కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ చేసిన ‘గోమూత్ర నిపుణుడు’ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా 215 మంది వైస్‌‌ చాన్స్​లర్లు,  మాజీ వైస్‌‌ చాన్స్​లర్లు, విద్యావేత్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు గురువారం ప్రియాంక గాంధీకి బహిరంగ లేఖ రాశారు. 

వ్యంగ్యంగా అయినా, రాజకీయ వ్యాఖ్యగా అయినా ఒక ప్రముఖ శాస్త్రవేత్తను ఇలాంటి పదజాలంతో సంబోధించడం సరికాదని లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి కామెంట్స్​ దేశ విద్యా, శాస్త్ర పరిశోధన రంగాలకు తప్పుడు సంకేతాలు పంపుతాయన్నారు. ఒక శాస్త్రవేత్త అభిప్రాయాలను ఆధారాలతో ఖండించకుండా, ఆయనపై ఒక ముద్ర వేయడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు.