అక్కినేని అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఆ విజయం ఎట్టకేలకు సొంతమైంది. అక్కినేని అఖిల్ తన కెరీర్‌లోనే మునుపెన్నడూ లేని విధంగా ఒక సంచలనాత్మకమైన విజయాన్ని అందుకుని, బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించారు. ఇటీవలే విడుదలైన ‘లెనిన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ విజయం అఖిల్ కెరీర్‌లో ఒక కీలక మైలురాయిగా నిలవడమే కాకుండా, ఆయనపై నమ్మకం ఉంచిన అక్కినేని ఫ్యాన్స్కు కూడా ప్రత్యేకమైన విజయంగా మారింది.
సితార & అన్నపూర్ణ బ్యానర్స్ గ్రాండ్ స్టేట్‌మెంట్
ఈ అద్భుత విజయంపై సితార & అన్నపూర్ణ సంస్థలు ఎమోషనల్ ట్వీట్స్ చేశాయి. సితార సంస్థ స్పందిస్తూ.. ‘‘ "ది రోర్'కు అండగా నిలిచిన ప్రతి ప్రేక్షకుడికీ ఇది ఒక వేడుక.. అక్కినేని అభిమానుల ప్రేమాభిమానాలకు దక్కిన గొప్ప పండుగ!’’ అని పేర్కొంది.
The ROAR has reached 100 CRORE+ WORLDWIDE GROSS ❤️🔥❤️🔥
— Sithara Entertainments (@SitharaEnts) July 30, 2026
A celebration that belongs to every audience member who stood by #LENIN 🔥🔥#BlockbusterLENIN 🌋 @AkhilAkkineni8 #BhagyashriBorse @iamnagarjuna @vamsi84 @KishoreAbburu @MusicThaman @pramodactor1 @NavinNooli @artkolla… pic.twitter.com/gncmWpZkZT
ఈ నేపథ్యంలోనే అన్నపూర్ణ స్టూడియోస్ స్పందిస్తూ తమ అభిమానులకు కృతజ్ఞతలు చెప్పింది. ‘‘నమ్మిన, మద్దతు ఇచ్చిన, ఆదరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ప్రయాణంలో మీ ప్రేమ, ప్రోత్సాహం మాకు ఎంతో బలాన్నిచ్చాయి. అపారమైన కృతజ్ఞతతో తదుపరి అడుగు వేస్తున్నాం. మీ అందరి ఆశీస్సులతో త్వరలోనే సరికొత్త కంటెంట్ ద్వారా మళ్లీ మీ ముందుకు వస్తాం’’ అని అన్నపూర్ణ సంస్థ తెలిపింది.
ALSO READ : Spider Man: Brand New Day Review
To everyone who believed, supported and accepted. This one is for you.
— Akhil Akkineni (@AkhilAkkineni8) July 30, 2026
On to the next with so much gratitude.
Thank you and See you at the movies very soon. 🙏🏻🫡#Lenin ❤️ pic.twitter.com/fWO5r0mXkQ
ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల వసూళ్లు..
సినిమాకు మొదటి రోజు నుంచే లభించిన పాజిటివిటీ, రిలీజ్ అనంతరం వచ్చిన బ్లాక్‌బస్టర్ టాక్ లెనిన్ సినిమాను నిలబెట్టాయి. ఈ రెండు కారణాల వల్లే లెనిన్ కలెక్షన్ల వర్షం కురుపించింది. ఏకంగా అఖిల్ ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి తన కెరీర్‌లో తొలి భారీ విజయం అందుకున్నాడు.
బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ రోర్..
డైరెక్టర్ మురళి కిషోర్ తెరకెక్కించిన ‘లెనిన్’ విలేజ్ బ్యాక్ డ్రాప్ తో రూపొందిన ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బలమైన కథనం, రస్టిక్ విజువల్స్, సహజమైన పాత్రలతో సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా అఖిల్ అక్కినేని తన కెరీర్‌లో ఇప్పటివరకు చూడని విధంగా రా అండ్ రస్టిక్ లుక్‌లో కనిపించి ప్రశంసలు అందుకున్నారు. ఆయన నటనలోని ఎమోషన్స్, యాక్షన్ సన్నివేశాల్లో చూపించిన ఇంటెన్సిటీ ప్రేక్షకులను మెప్పించాయి. హీరోయిన్ భాగ్యశ్రీ కూడా తన పాత్రలో చక్కటి నటనతో ఆకట్టుకున్నారు. మొత్తానికి అఖిల్ పొటెన్షియల్‌కు తగ్గ సరైన బొమ్మ పడిందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.
