ప్రపంచ వ్యాప్తంగా మార్వెల్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విజువల్ వండర్ 'స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే' ('Spider-Man: Brand New Day) ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చింది. భారతీయ ప్రేక్షకుల కోసం ఒక రోజు ముందుగానే ఈ చిత్రాన్ని భారీ అంచనాలతో జూలై 30న విడుదల చేశారు మేకర్స్. అమెరికాలో జూలై 31న విడుదల కానుంది. టామ్ హాలండ్ మరోసారి స్పైడర్-మ్యాన్‌గా ప్రేక్షకుల ముందుకు రావడంతో ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. డెస్టిన్ డానియల్ క్రెటన్ దర్శకత్వం వహించిన ఈ హాలీవుడ్ యాక్షన్ క్రేజీ స్పెక్టాకిల్ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం..
కథలోకి వెళ్తే..
'స్పైడర్-మ్యాన్: నో వే హోమ్' పీటర్ పార్కర్ (టామ్ హాలండ్) ఉనికినే ప్రపంచం మర్చిపోయిన తరుణంలో.. ఆ ఒంటరితనాన్ని జయిస్తూ సాగే కథతో ఈ సినిమా రూపొంచారు. 'నో వే హోమ్' క్లైమాక్స్ తర్వాత ప్రపంచమంతా పీటర్ పార్కర్ (టామ్ హాలాండ్) ని మర్చిపోతుంది. ఒంటరితనంతో బాధపడుతున్న పీటర్, తన శారీరక శక్తుల్లో కొన్ని వింత మార్పులు గమనిస్తాడు. మరోవైపు 'డిపార్ట్‌మెంట్ ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్' (DDC) పై అదృశ్య రూపంలో ఉన్న ఒక రహస్య టెలిపాత్ దాడి చేస్తుంది. అత్యంత ప్రమాదకరమైన 'V-MAX' అనే దాని కోసం ఈ దాడి జరుగుతుంది. ఇంతకీ ఆ దాడి చేసింది ఎవరు? ఆ దాడుల వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? జీన్ గ్రే' (సాడీ సింక్) కథేంటి? అతడు వెతుకుతున్న V-MAX అనే రహస్య శక్తి ఏమిటి? ఈ గందరగోళం మధ్యలోకి హల్క్ (మార్క్ రుఫాలో), పనిషర్ (జాన్ బెర్న్‌థాల్), 'ది హ్యాండ్' ఎలా వచ్చారు? పీటర్ ఈ గ్లోబల్ ముప్పును ఎలా అడ్డుకున్నాడు అనేదే మిగతా కథ.
ఎలా ఉందంటే.?
సినిమాకు అసలైన బలం యాక్షన్ ఎపిసోడ్లే. హల్క్‌తో స్పైడర్-మ్యాన్ తలపడే భారీ ఫైట్, ది హ్యాండ్‌తో జరిగే స్టైలిష్ కామ్బాట్ సీక్వెన్స్‌లు, విజువల్ ఎఫెక్ట్స్‌తో నిండిన క్లైమాక్స్ ప్రేక్షకులను సీట్ల అంచులపై కూర్చోబెడతాయి. ప్రతి యాక్షన్ బ్లాక్ హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించడంతో థియేటర్లలో ప్రేక్షకులు విజిల్స్ వేయకుండా ఉండలేరు.
అయితే సినిమా ప్రధాన బలహీనత స్క్రీన్‌ప్లే. కథలో ఉన్న ట్విస్టులు పెద్దగా ఆశ్చర్యపరచవు. ప్రతీకారం నేపథ్యంలో నడిచే ప్రధాన సంఘర్షణకు మరింత భావోద్వేగ బలం ఉండాల్సిన చోట రచన కొంత తడబడిందన్న టాక్ వినిపిస్తోంది. హల్క్ సబ్‌ప్లాట్, DDC ట్రాక్, V-MAX మిస్టరీ వంటి అంశాలు పూర్తిస్థాయిలో ఎక్స్‌ప్లోర్ చేయకపోవడంతో కొన్ని ప్రశ్నలు సమాధానం లేకుండానే మిగిలిపోతాయి. నెడ్ పాత్రలో జేకబ్ బటాలన్ కూడా ఈసారి పెద్దగా మెప్పించలేకపోయారన్న అభిప్రాయాన్ని ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు..
మరోవైపు సాంకేతికంగా మాత్రం సినిమా హాలీవుడ్ స్టాండర్డ్‌ను నిలబెట్టింది. బ్రెట్ పావ్‌లాక్ సినిమాటోగ్రఫీ, గ్రాండ్ విజువల్స్, అద్భుతమైన VFX సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. మైఖేల్ జియాకినో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సన్నివేశాలను మరింత ఎలివేట్ చేసింది. ముఖ్యంగా పెంగ్ జాంగ్, జాకీ చాన్ స్టంట్ టీమ్ రూపొందించిన ఫైట్ కొరియోగ్రఫీ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలిచింది.
ఎవరెవరు ఎలా చేశారంటే?
టామ్ హాలండ్ మరోసారి పీటర్ పార్కర్ పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయాడు. భావోద్వేగాలు, హాస్యం, యాక్షన్... మూడు కోణాల్లోనూ తన నటనతో ఆకట్టుకున్నాడు. జెండయాకు స్క్రీన్ టైమ్ తక్కువైనా ఆమె కనిపించే ప్రతి సన్నివేశం కథకు భావోద్వేగాన్ని జోడిస్తుంది. మార్క్ రఫెలో హల్క్‌గా, జాన్ బెర్న్థాల్ పనిషర్‌గా తమ పాత్రలకు న్యాయం చేశారు. కొత్తగా ఎంట్రీ ఇచ్చిన సాడీ సింక్ పోషించిన జీన్ గ్రే పాత్ర కథలో కీలకమైనదే అయినప్పటికీ, ఆ పాత్రను మరింత బలంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందనే భావన కలుగుతుంది.
పబ్లిక్ టాక్ ఇదే..
ఇప్పటికే సోషల్ మీడియాలో సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. చాలామంది అభిమానులు ఇది పీటర్ పార్కర్ ఒంటరితనాన్ని హృదయాన్ని తాకేలా చూపించిన భావోద్వేగ ప్రయాణమని కొనియాడుతున్నారు. టామ్ హాలండ్ కెరీర్‌లో మరో బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని కామెంట్లు చేస్తున్నారు. మునుపటి స్పైడర్ మ్యాన్ చిత్రాలకు కన్నా ఇది పూర్తిగా భిన్నమైన అనుభూతిని ఇస్తుందని ప్రశంసిస్తున్నారు.
#SpiderManBrandNewDay [4.5/5] : A Fun Emotional Action Ride..#Spiderman fans will get everything you expect from him..#Hulk is good..
— Ramesh Bala (@rameshlaus) July 29, 2026
Action set pieces are spectacular..#TomHolland - #Zendaya track will give the emotional high..
Villain and supporting characters add so… pic.twitter.com/PKoNw61F7v
మరికొందరు మాత్రం యాక్షన్ అద్భుతంగా ఉన్నా కథ మరింత బలంగా ఉండి ఉంటే ఈ సినిమా ఫ్రాంచైజీలో అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలిచేదని అభిప్రాయపడుతున్నారు. మొదటి 20 నిమిషాలు అచ్చమైన కామిక్ బుక్ స్పైడీలా ఉందన్నారు. పీటర్ పార్కర్ గా టామ్ హాలండ్ అద్భుత నటన కనబరిచాడని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
#SpiderMan Brand New Day is a mixed bag. It evokes the very best and the very worst of Sam Raimi’s Spider-Man trilogy. The first 20 minutes are quintessential comic book Spidey and do for Spider-Man what the first 20 minutes of Matt Reeves’ The Batman did for Batman. The film… pic.twitter.com/Ou2HbF3Wlh
— The HoloFiles - Movie/TV News & Reviews (@theholofiles) July 28, 2026
మొత్తంగా చూస్తే 'స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే' యాక్షన్, విజువల్స్, టామ్ హాలండ్ నటన కోసం తప్పక చూడాల్సిన సూపర్ హీరో ఎంటర్‌టైనర్. కథలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ.. స్పైడర్-మ్యాన్ అభిమానులకు ఇది థియేటర్లలో ఆస్వాదించదగ్గ గ్రాండ్ విజువల్ ట్రీట్‌గా నిలుస్తుందని సినీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి..
