మరో పోలీస్ నోటిఫికేషన్.. 325 ఎస్ఐ, ఏఎస్ఐ పోస్టులు.. నిరుద్యోగులకు మంచి ఛాన్స్

మరో పోలీస్ నోటిఫికేషన్.. 325 ఎస్ఐ, ఏఎస్ఐ పోస్టులు.. నిరుద్యోగులకు మంచి ఛాన్స్

తెలంగాణ రాష్ట్ర  స్థాయి పోలీసు నియామక మండలి (టీజీపీఆర్​బీ) పలు విభాగాల్లో  ఏఎస్‌‌‌‌ఐ , స్టేషన్ ఫైర్ ఆఫీసర్, డిప్యూటీ జైలర్, సబ్ ఇన్​స్పెక్టర్, ఆర్ఎస్ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

మొత్తం పోస్టులు: 325.

విభాగాల వారీగా ఖాళీలు
సబ్ ఇన్​స్పెక్టర్ (ఎస్ఐ) 275: ఎస్ఐ (సివిల్) 148, రిజర్వ్ ఎస్ఐ (ఏఆర్) 14, రిజర్వ్ ఎస్ఐ (టీజీఎస్ పీ– పురుషులు) 12, ఎస్ఐ (టీఎస్​పీఎఫ్) 44, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ 39, డిప్యూటీ జైలర్ (పురుషులు) 14, డిప్యూటీ జైలర్ (మహిళలు) 1. 

కానిస్టేబుల్ (మెకానిక్ & డ్రైవర్) 27: కానిస్టేబుల్ (మెకానిక్– పురుషులు) 7, కానిస్టేబుల్ (డ్రైవర్– పురుషులు) 20. ఏఎస్ఐ(ఫింగర్ ప్రింట్ బ్యూరో) 23

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో  బీఈ/ బి.టెక్/ బీఎస్సీ, ఏదైనా డిగ్రీ, ఇంటర్మీడియట్, పదోతరగతితోపాటు సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తిచేసి ఉండాలి. స్టేషన్ ఫైర్ ఆఫీసర్ అభ్యర్థులు లైట్ మోటార్ వెహికల్, కానిస్టేబుల్ (డ్రైవర్) అభ్యర్థులు హెచ్​పీఎంవీతోపాటు హెచ్​జీవీ/ ట్రాన్స్​పోర్ట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. 

వయోపరిమితి: ఎస్ఐ (సివిల్), ఆర్ఎస్ఐ, ఎస్ పీఎఫ్ ఎస్ఐ, ఎస్ఎఫ్ఓ, డిప్యూటీ జైలర్, ఏఎస్ఐ (ఫింగర్ ప్రింట్ బ్యూరో) పోస్టులకు 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి. కానిస్టేబుల్ (మెకానిక్, డ్రైవర్) పోస్టులకు 18 నుంచి 27 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ విధానం: ఆన్​లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ స్వీకరణ, ముగింపు తేదీలను త్వరలో ప్రకటించనున్నారు.

సెలెక్షన్ ప్రాసెస్: ప్రిలిమినరీ రాత పరీక్ష (పీడబ్ల్యూటీ), ఫిజికల్ మెజర్​మెంట్ టెస్ట్ (పీఎంటీ), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ), ఫైనల్ రిటన్ పరీక్ష (ఎఫ్ డబ్ల్యూఈ), సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్ సైట్ www.tgprb.inను సందర్శించవచ్చు.   

►ALSO READ | TGPRB jobs: తెలంగాణలో 7,112 కానిస్టేబుల్ పోస్టుల నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!