గురుకులాల్లో విద్యార్థుల హాజరుపై ప్రత్యేక దృష్టి : ఎస్సీ గురుకుల సెక్రటరీ రవినాయక్

గురుకులాల్లో విద్యార్థుల హాజరుపై ప్రత్యేక దృష్టి : ఎస్సీ గురుకుల సెక్రటరీ రవినాయక్

హైదరాబాద్,  వెలుగు: గురుకుల విద్యార్థుల హాజరును ప్రతిరోజూ ఫేస్‌‌‌‌‌‌‌‌ రికగ్నిషన్‌‌‌‌‌‌‌‌ సిస్టమ్‌‌‌‌‌‌‌‌ (ఎఫ్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌) ద్వారా 100 శాతం నమోదు చేయాలని ఎస్సీ గురుకుల సెక్రటరీ రవి నాయక్ అధికారులను ఆదేశించారు. హాజరు నమోదులో జాప్యానికి తావు ఉండకూడదని, కేవలం వైద్యపరమైన కారణాలతో గైర్హాజరయ్యే విద్యార్థులకు మాత్రమే నిబంధనల మేరకు మినహాయింపు ఇవ్వాలని స్పష్టం చేశారు. 

ఆదివారం ఆయన జోనల్‌‌‌‌‌‌‌‌ అధికారులు, జిల్లా సమన్వయకర్తలు, ప్రిన్సిపాళ్లతో జూమ్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో యూనిఫాంలు, విద్యార్థుల సామగ్రి పంపిణీ, ఎఫ్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ హాజరు, ప్రొవిజన్ల ఇండెంట్‌‌‌‌‌‌‌‌ తదితర అంశాలపై చర్చించారు. ఒక గురుకులంలో అవసరానికి మించి బ్యాగులు లేదా ఇతర సామగ్రి ఉంటే, కొరత ఉన్న స్కూళ్లకు వాటిని తక్షణమే సర్దుబాటు చేయాలని సూచించారు.