2027 వరల్డ్‌కప్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్.. 12 స్టేడియాలు, త్రీ నేషన్స్, వన్ హార్ట్‌బీట్ థీమ్ రిలీజ్!

2027 వరల్డ్‌కప్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్.. 12 స్టేడియాలు, త్రీ నేషన్స్, వన్ హార్ట్‌బీట్ థీమ్ రిలీజ్!

ODI World Cup 2027: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) పురుషుల వన్డే ప్రపంచకప్ 2027కి సంబంధించి అత్యంత కీలకమైన ప్రకటన విడుదల చేసింది. సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా నిర్వహించనున్న ఈ మెగా టోర్నీ కోసం మొత్తం 12 మైదానాలను ఐసీసీ ఖరారు చేసింది. జోహ్యాన్నెస్‌బర్గ్‌లో జరిగిన ప్రత్యేక ఆవిష్కరణ వేడుకలో టోర్నమెంట్ అధికారిక బ్రాండ్ థీమ్ త్రీ నేషన్స్, వన్ హార్ట్‌బీట్ (Three Nations, One Heartbeat) ను ఐసీసీ గ్రాంఢ్ గా ఆవిష్కరించింది.

3 దేశాలు.. 12 స్టేడియాలు:
ఈ 50 ఓవర్ల మెగా టోర్నమెంట్ లో జరిగే మ్యాచ్‌లకు సౌతాఫ్రికాలోని 8 మైదానాలు, జింబాబ్వేలోని 3, నమీబియాలోని 1 మైదానం ఆతిథ్యమివ్వనున్నాయి. 

* సౌతాఫ్రికా (8 వేదికలు): వాండరర్స్ (జోహ్యాన్నెస్‌బర్గ్), సెంచూరియన్ (ట్వానే), న్యూలాండ్స్ (కేప్ టౌన్), కింగ్స్‌మీడ్ (డర్బన్), సెయింట్ జార్జెస్ పార్క్ (గెబర్హా), మంగాంగ్ ఓవల్ (బ్లూమ్‌ఫోంటైన్), బోలాండ్ పార్క్ (పార్ల్), బఫెలో పార్క్ (కుగోంపో సిటీ).

* జింబాబ్వే (3 వేదికలు): హరారే స్పోర్ట్స్ క్లబ్, క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ (బులావాయో), ఫాలే మోసి-ఓ-తున్యా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం (విక్టోరియా ఫాల్స్).

* నమీబియా (1 వేదిక): నమీబియా క్రికెట్ గ్రౌండ్ (విండ్‌హోక్). 

24 ఏళ్ల తర్వాత ఆఫ్రికా గడ్డపైకి మళ్లీ వన్డే వరల్డ్ కప్!
దాదాపు 24 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత పురుషుల వన్డే ప్రపంచకప్ మళ్లీ ఆఫ్రికా ఖండానికి తిరిగి రాబోతోంది. చివరిసారిగా 2003లో సౌతాఫ్రికా, జింబాబ్వే, కెన్యాలు సంయుక్తంగా ఈ టోర్నీని నిర్వహించాయి. 2027లో జరగబోయే ఈ ఎడిషన్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 14 జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి.

త్రీ నేషన్స్, వన్ హార్ట్‌బీట్ థీమ్: 
ఈ టోర్నీ అధికారిక థీమ్ త్రీ నేషన్స్, వన్ హార్ట్‌బీట్ ఆఫ్రికాలోని ప్రసిద్ధ ఉబుంటు (Ubuntu) తత్వశాస్త్రం ఆధారంగా రూపొందించబడింది. ఉబుంటు అంటే నేను ఉన్నాను.. ఎందుకంటే మనం ఉన్నాం అని అర్థం.. క్రికెట్ ద్వారా మూడు ఆఫ్రికన్ దేశాల సంస్కృతి, ఐక్యత, వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పడమే ఈ థీమ్ యొక్క ప్రధాన ఉద్దేశం.

►ALSO READ | తైపీ ఓపెన్‌‌ సూపర్‌‌–300 టోర్నీ.. క్వార్టర్స్‌‌లో ఉన్నతి

24 ఏళ్ల తర్వాత ఆఫ్రికా గడ్డపైకి వన్డే వరల్డ్ కప్: 
దాదాపు 24 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత పురుషుల వన్డే ప్రపంచకప్ మళ్లీ ఆఫ్రికా ఖండంలో జరగబోతుంది. చివరిసారిగా 2003లో సౌతాఫ్రికా, జింబాబ్వే, కెన్యాలు సంయుక్తంగా ఈ మెగా టోర్నమెంట్ను నిర్వహించాయి. మళ్లీ 2027లో జరగబోయే ఈ ఎడిషన్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 14 జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. 

జై షా ఉత్సాహం.. ఫ్యాన్స్ రిజిస్ట్రేషన్స్: 
ఈ సందర్భంగా ఐసీసీ ఛైర్మన్ జై షా స్పందిస్తూ.. మూడు దేశాల్లోని 12 వేదికలు, కొత్త బ్రాండ్ థీమ్‌ను ప్రకటించడం ఎంతో ఉత్సాహాన్నిస్తోందని పేర్కొన్నాడు. ఈ ఆవిష్కరణ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను ఏకం చేసే ఒక అద్భుతమైన ప్రయాణానికి పునాది వేసింది అని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు.