తైపీ సిటీ: ఇండియా షట్లర్లు ఉన్నతి హుడా, తన్వీ శర్మ, దేవికా సిహాగ్.. తైపీ ఓపెన్ సూపర్–300 టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన విమెన్స్ సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఉన్నతి 21–19, 21–12తో తన్యా హేమంత్‌పై గెలవగా, తన్వీ 21–17, 22–20తో తలిత రమధాని (ఇండోనేసియా)ను చిత్తు చేసింది.
మరో మ్యాచ్‌లో ఎనిమిదో సీడ్ దేవిక 21–16, 21–15తో కదేక్ ధిందాలపై నెగ్గింది. మెన్స్ సింగిల్స్ క్వార్టర్స్‌లో కిరణ్ జార్జ్ 21–15, 21–16తో తరుణ్ మన్నెపల్లిని ఓడించాడు.
