బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది.పెళ్లి పేరుతో తనను లైంగికంగా వేధించాడంటూ యువతి ఫిర్యాదు చేయడంతో జులై 26న రేప్ కేసు నమోదు చేశారు పంజాగుట్ట పోలీసులు. ఇంటర్వ్యూ పేరుతో తన ఫ్లాట్ కి పిలిచి లైంగిక దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొంది యువతి. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని తెలిపింది బాధితురాలు
పెళ్లి పేరుతో తనకు దగ్గరయ్యి శారీరకంగా వాడుకున్నాడని... తనకి తెలియకుండానే ప్రైవేట్ వీడియోలు చిత్రీకరించాడని ఫిర్యాదులో పేర్కొంది బాధితురాలు. రియల్ ఎస్టేట్లో పెట్టుబడుల పేరుతో తన దగ్గర డబ్బులు సైతం తీసుకున్నాడని పేర్కొంది బాధితురాలు.
►ALSO READ | ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కేటీఆర్ విచారణ.. ఆగస్ట్ 25కు వాయిదా
తన ఫోన్ యాక్సిస్ చేసి తన స్నేహితురాలికి సైతం ఇదే రీతిలో మెసేజ్ లు చేసి దగ్గర అయ్యాడని తెలిపింది.ఈ క్రమంలో రేగా కాంతారావుపై BMS 69 తో పాటు 351 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
