ప్రపంచవ్యాప్తంగా రాజకీయా ఉద్రిక్తల భయాలు కొద్దిగా తగ్గినా.. బంగారం, వెండి ధరలు స్వల్ప హెచ్చుతగ్గులకు లోనవుతూనే ఉంది. అయితే, మధ్యప్రాచ్యంలో (పశ్చిమ ఆసియాలో) రోజురోజుకూ పెరుగుతున్న ఉద్రిక్తతల వల్ల బంగారం ధరలు మాత్రం ఈ రోజూ(31 జులై ) శుక్రవారం కొద్దిగా మారాయి.
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు:
గాజా శాంతి ఒప్పందం ద్వారా హమాస్‌ను నిరాయుధులను చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇజ్రాయెల్ భద్రతకు, పాలస్తీనా పాలనకు ఇది చారిత్రాత్మక అడుగు అని ఆయన అన్నారు. మరోవైపు, దక్షిణ లెబనాన్‌లోని పలు ప్రాంతాలపై ఇజ్రాయెల్ గత అర్ధరాత్రి భారీ దాడులు చేసింది. ఈ పేలుళ్ల తీవ్రతకు ఇళ్ల కిటికీలు పగిలిపోయి, భవనాలు దెబ్బతిన్నాయి.
మధ్యప్రాచ్యంలో ఘర్షణలు పెరుగుతుండటంతో, గత గురువారం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఏకంగా 6% పెరిగి, మే నెల తర్వాత తొలిసారిగా బ్యారెల్‌కు 100 డాలర్ల మార్కును దాటింది. 2026 జూన్ మధ్యలో అమెరికా, ఇరాన్‌ల మధ్య కుదిరిన 60 రోజుల తాత్కాలిక శాంతి ఒప్పందం ఎక్కువ కాలం నిలవలేదు. దాడులు మళ్లీ ప్రారంభం కావడంతో ఆ ఒప్పందం రద్దయింది.
ఈ కారణాల వల్ల యుద్ధ భయాలు, ఆర్థిక అస్థిరత మళ్లీ తలెత్తడంతో.. పెట్టుబడిదారులు సురక్షితమైన ఆస్తిగా భావించి తిరిగి బంగారంపై పెట్టుబడులు పెడుతున్నారు. అదే సమయంలో పన్నులు, దిగుమతి సుంకాలు, డాలర్ మారకపు రేట్లలో మార్పుల కారణంగా స్థానికంగా బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతు వస్తున్నాయి.
►ALSO READ | హైదరాబాద్ లో స్టార్ బక్స్ రిజర్వ్.. దక్షిణాదిలో తొలి స్టోర్..
1 గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ.27 పెరిగి రూ. 14,460, 22క్యారెట్ల బంగారం ధర రూ.25 పెరిగి రూ.13,255, 18క్యారెట్ల బంగారం ధర రూ. 20 పెరిగి రూ.10,845
10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.270 పెరిగి రూ. 1,44,600, 22క్యారెట్ల బంగారం ధర రూ.250 పెరిగి రూ.1,32,550, 18క్యారెట్ల బంగారం ధర రూ.200 పెరిగి రూ.1,08,450.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ నగరాల్లో :
హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,44,600, 22క్యారెట్ల బంగారం ధర రూ.1,32,550, 18క్యారెట్ల బంగారం ధర రూ.1,08,450.
విజయవాడ, విశాఖపట్నం, అమరావతి, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, తిరుపతి, కడప, అనంతపురంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,44,600, 22క్యారెట్ల బంగారం ధర రూ.1,32,550, 18క్యారెట్ల బంగారం ధర రూ.1,08,450.
ఇక ఈ రోజు వెండి ధర చూస్తే ఎలాంటి మార్పులు లేకుండా స్థిరంగా ఉంది. దింతో వెండి 1 గ్రాము ధర రూ.235 ఉండగా... కేజీ ధర రూ.2,35,000గా ఉంది.
