గవర్నమెంట్ స్కూల్ టీచర్ అని ఏరికోరి చేసుకుని.. ఇంట్లో అడుగుపెట్టగానే మామను మింగేశావన్నారు.. పాపం..

గవర్నమెంట్ స్కూల్ టీచర్ అని ఏరికోరి చేసుకుని.. ఇంట్లో అడుగుపెట్టగానే మామను మింగేశావన్నారు.. పాపం..

బతకటానికే జనం చస్తుంటే.. బతకటానికి కావాల్సిన అన్నీ ఉన్నాయి.. అందులోనూ ప్రభుత్వ ఉద్యోగం.. ప్రభుత్వ టీచర్గా పని చేస్తున్న భార్యను కట్నం కోసం వేధించాడు ఆ భర్త. పెళ్లయ్యి ఎనిమిది నెలలు మాత్రమే.. పెళ్లయ్యి అత్తారింట్లో అడుగు పెట్టినప్పటి నుంచి మొదలయ్యాయంట వేధింపులు.

డబ్బు.. డబ్బు అంటూ అత్త ఫ్యామిలీ మొత్తం ఒకటే చిత్రహింసలు అంట.. ఎవరికీ చెప్పుకోలేక.. కన్న తల్లిదండ్రులకు చెప్పి వాళ్లను బాధపెట్టటం ఇష్టం లేక.. ఎనిమిది నెలలుగా అనుభవిస్తున్న నరకంతోపాటు.. ఇక వాళ్లు ఎప్పటికీ మారరు అనే ఉద్దేశానికి వచ్చి.. ఆత్మహత్య చేసుకున్నది ఆ ప్రభుత్వ టీచర్. చనిపోతూ తన బాధలను సెల్ఫీ వీడియో తీసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఆమె పేరు సృష్టి కంధారి. డెహ్రడూన్లో ప్రభుత్వ టీచర్ గా పని చేస్తుంది. సర్కారీ కొలువు. 2025 నవంబర్ నెలలో ఖత్రి అనే వ్యక్తితో పెళ్లయ్యింది. అతను కూడా ప్రభుత్వ ఉద్యోగినే. ఉత్తరాఖండ్ సచివాలయంలో పని చేస్తున్నాడు. ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే. ఖత్రితో పెళ్లయిన తర్వాత డెహ్రడూన్కు 20 కిలోమీటర్ల దూరంలోని దోయివాలా ప్రాంతంలో నివాసం ఉంటున్నారు.

పెళ్లయిన తర్వాత సృష్టి కంధారి అత్తారింట్లో అడుగు పెట్టిన తర్వాత.. కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతూ.. మంచానికే పరిమితం అయిన అతని మామ.. అంటే భర్త తండ్రి చనిపోయాడు. ఇలా జరగటానికి సృష్టి కంధారినే కారణం అని.. ఆమె ఇంట్లో అడుగుపెట్టిన తర్వాతనే ఇలా జరిగిందని.. దరిద్రమైన పాదం అని.. దురదృష్టవంతురాలు అంటూ తిట్టటం మొదలుపెట్టారు. దీనికితోడు డబ్బు.. డబ్బు అంటూ నిత్యం వేధింపులకు గురి చేశారు.

ఎనిమిది నెలలుగా భరిస్తూ వస్తున్న సృష్టి కంధారి.. వీళ్లు మారరు.. వాళ్ల మనస్తత్వం అంతే అనే నిర్ధారణకు వచ్చి.. తన బాధలు, ఎనిమిది నెలలుగా పడిన నరకాన్ని వీడియో రూపంలో రికార్డ్ చేసి చనిపోయింది. 

కొన్ని రోజులుగా సృష్టి కంధారి.. తన కుటుంబ సభ్యులతో మాట్లాడటం లేదు. అనుమానం వచ్చిన వారు.. కూతురు ఇంటి పక్కన వాళ్లకు.. తెలిసిన వాళ్లకు ఫోన్ చేయగా.. ఆస్పత్రిలో ఉన్నట్లు చెప్పారు. కుటుంబ సభ్యులు డెహ్రడూన్ వచ్చారు. చికిత్స పొందుతూ సృష్టి చనిపోయింది.

సృష్టి మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ.. కట్నం వేధింపులు, మానసిక వేధింపుల కింద భర్త, అత్త, ఆడపడుచుపై కేసు పెట్టారు బంధువులు. ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు.. ప్రభుత్వ టీచర్ ఉద్యోగం చేస్తున్న భార్యను నిత్యం నరకం చూపించిన భర్త ఖత్రిని, అతని తల్లిని, చెల్లిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.