వీడియో : పార్లమెంట్ లో రామ మందిరం విరాళాల దోపిడీపై పప్పూయాదవ్, రాహుల్ గాంధీ స్కిట్

వీడియో : పార్లమెంట్ లో రామ మందిరం విరాళాల దోపిడీపై పప్పూయాదవ్, రాహుల్ గాంధీ స్కిట్

అయోధ్య రామ మందిరంపై వందల కోట్ల విరాళాల దోపిడీ ఇప్పుడు పార్లమెంట్ ఆవరణలో దుమారం రేపుతోంది. యూపీకి చెందిన ఎంపీ పప్పూ యాదవ్ స్కిట్ చేయగా.. రాహుల్ గాంధీ దండం పెట్టి హుండీలో డబ్బులు వేస్తూ స్కిట్ లో పాల్గొన్నారు. పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్షాల పార్టీ ఎంపీలతో జరిగిన ఈ స్కిట్ ఇప్పుడు కలకలం రేపుతోంది. 

2026, జూలై 31వ తేదీ ఉదయం.. పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు ఎంపీలు. పార్లమెంట్ ఆవరణలో.. ప్రధాన గేటు ఎదుట యూపీకి చెందిన ఎంపీ పప్పూయాదవ్.. కాషాయం దుస్తులతో వచ్చారు. కింద కూర్చుని హుండీలు పెట్టారు. రామ మందిరంపై విరాళాల దొంగతనంపై నిరసన వ్యక్తం చేస్తూ.. చోర్ చోర్ అంటూ నినాదాలు చేశారు. 

ఎంపీ పప్పూయాదవ్ కాషాయ దుస్తుల్లో.. హుండీలకు పూల దండలు వేసి.. హుండీలో చందాలు వేయాలని కోరతాడు. ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ.. పప్పూయాదవ్ దగ్గరకు వచ్చి.. దేవుడికి దండం పెట్టి.. హుండీలో డబ్బులు వేస్తాడు. ఆ డబ్బులను పప్పుయాదవ్ తీసుకుని తన జేబులో పెట్టుకుంటాడు. రామ మందిరంలో విరాళాలు ఏ విధంగా దోపిడీ అయ్యాయి.. ఏ విధంగా దొంగతనానికి గురయ్యాయి అని చెబుతూ.. పప్పూయాదవ్, రాహుల్ గాంధీ చేసిన ఈ స్కిట్ నవ్వులు పూయించింది. 

ALSO READ : ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కేటీఆర్ విచారణ..

రాహుల్ గాంధీ తర్వాత.. ప్రతిపక్ష పార్టీ ఎంపీలు అందరూ హుండీలో డబ్బులు వేయటానికి వస్తారు.. డబ్బులను హుండీలో వద్దు.. నా చేతికి ఇవ్వండి అని పప్పుయాదవ్ ఈ డబ్బులు తీసుకుని తన జేబులో పెట్టుకుంటాడు. ఈ స్కిట్ తో పార్లమెంట్ ఆవరణలో హంగామా నడిచింది.