ఢిల్లీ: దేశవ్యాప్తంగా కార్మిక, కర్షక సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్కు సంఘీభావం తెలుపుతూ కాంగ్రెస్ శ్రేణులు కూడా నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని ఏఐసీసీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఒక ప్రకటన విడుదల చేసింది.
29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్స్తో భర్తీ చేసి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుండటాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఉన్న10 సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. INTUC, AITUC, HMS, CITU, AIUTUC, TUCC, AICCTU, LPF, UTUC, SEWA ట్రేడ్ యూనియన్లు బంద్కు పిలుపునిచ్చాయి.
రైతు సంఘాలు కూడా భారత్ బంద్కు మద్దతు ప్రకటించాయి. కొత్త కార్మిక చట్టాలైన.. వేజ్ కోడ్ (2019), ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ (2020), సోషల్ సెక్యూరిటీ కోడ్ (2020), ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ (2020) అమలు చేయడం వల్ల కార్మిక హక్కులను బలహీనపర్చారని.. కార్మికులను ఉన్నపళంగా డిస్మిస్ చేసేందుకు యాజమాన్యాలకు ఈ కొత్త కార్మిక చట్టాలతో వెసులుబాటు లభించిందని ట్రేడ్ యూనియన్లు మండిపడ్డాయి.
