
యాంకర్ అనసూయ(Anasuya) ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఓపక్క సినిమాలు చేస్తూనే, మరోపక్క యాంకర్ గా కూడా కొనసాగుతున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటారు అను. తన సినిమాలు, ఫ్యామిలీకి సంబందించిన విషయాలను అభిమానులతో పంచుకంటూ ఉంటారు.
అప్పుడప్పుడు కొన్ని విషయాల్లో కాంట్రావర్సిలకు కూడా ఛాన్స్ ఇస్తూ ఉంటారు. తనపై వచ్చే ట్రోలింగ్స్ కూడా సాలిడ్ కౌంటర్లు ఇస్తూ ఉంటారు. కానీ ఎవరో ఎదో అన్నారని తన వ్యక్తిత్వాన్ని మార్చుకునే క్యారక్టర్ కాదు ఆమెది. తానూ చేయాలనుకుంది చేస్తుంది. చెప్పాలనుకుంది చెప్తుంది. దాని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఆమెనే ధైర్యంగా ఎదుర్కొంటుంది. తాజాగా ఇదే విషయంపై సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అనసూయ.
Also Read :- భజన ఆపి మంచి సినిమా తీయండి
దసరా పండుగ సందర్బంగా స్త్రీ శక్తి, ఆరోగ్యంపై పోస్ట్ చేసింది. దానికి జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న వీడియోను యాడ్ చేసింది.. దసరా అంటే చెడుపై మంచి గెలడం. అలాగే బద్దకంపై శ్రమ గెలవడాన్ని కూడా మనం సెలబ్రేట్ చేసుకోవాలి. అనుమానాలు, భయాల నుంచి బయటకి వచ్చినందుకు సెలబ్రేట్ చేసుకోవాలి. నా సొంత అనుభవంతో చెప్తున్నా. మా నాన్న చనిపోయాక నాకు దేనిమీద ఆసక్తి ఉండేది కాదు. కానీ ఏదో ఒకరోజు మొదలుపెట్టాలి కదా. అప్పుడు మా నాన్న చెప్పిన ఆరోగ్యమే మహాభాగ్యం అనే మాట గుర్తొచ్చింది. అప్పుడు మళ్ళీ మొదలుపెట్టాను.
మహిళలు అంతా కూడా తమ లైఫ్ స్టైల్ మీద దృష్టి సారించాలి. మనం శక్తి స్వరూపం.. అది మర్చిపోవద్దు. ఈ వయసులో నీకు అవసరమా ఆంటీ, ఇంట్లో పిల్లలని చూసుకోవచ్చు కదా.. అనే వాళ్లంతా మనల్ని చూసి భయపడాలి. ఆ రకంగా మనం మన ఆరోగ్యంపై ఫోకస్ పెట్టాలి. ప్రతి మహిళా కాళీమాతలా మారాలి.. అని రాసుకొచ్చారు. ప్రస్తుతం అనసూయ చేసిన ఈ వీడియో వవైరల్ గా మారింది.