భజన ఆపి మంచి సినిమా తీయండి.. అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడుగా

భజన ఆపి మంచి సినిమా తీయండి.. అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడుగా

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్(Harish shankar) సినిమాలతో కాదు సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటారు. తన సినిమాలు, అప్పుడప్పుడు రాజకీయాలపై కూడా తనదైన స్టైల్లో కౌంటర్లు వేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఫ్యాన్స్ అడిగే ప్రశ్నలకు అదిరిపోయే రిప్లైస్ ఇస్తూ ఉంటారు. తాజాగా మరోసారి నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు తనదైన కౌంటర్స్ వేసాడు హరీష్ శంకర్. 

ప్రస్తుతం ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా చేస్తున్నారు. దసరా కానుకగా ఈ సినిమా నుండి పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ కు మాస్ ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. చేతిలో సుత్తి పట్టుకుని ఉన్న పవన్ కళ్యాణ్ లుక్ కు ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే ఈ పోస్టర్ కు కొంతమంది నెటిజన్స్ వెటకారంగ స్పందించారు. వాటికి అంతే వెటకారంగ బదులిచ్చాడు దర్శకుడు హరీష్ శంకర్. 

ముందుగా ఒక నెటిజన్.. ఉస్తాద్ సభగత్ సింగ్ సినిమాను ఓజీ తరువాత రిలీజ్ చేయండి అన్నా అని అడిగాడు. దానికి బదులుగా.. అది మన చేతిలో లేదు తమ్ముడు అంటూ రిప్లయ్ ఇచ్చాడు. ఇక మరో నెటిజన్.. ఎంత బాగా తీసినా ముందు ఆయన చూడాలి కదా అని కామెంట్ చేశాడు. దానికి బదులుగా.. ఆయన చూడటానికి సినిమా చేయడంలేదు.. అయన్ని చూపించడానికి చేస్తున్నాను అంటూ అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు హరీష్. 

Also Read :- లియో ప్రమోషన్స్లో ప్రమాదం

ఇక మరో నెటిజన్.. మీరు కొంచెం ఆ భజన ఆపి మంచి సినిమాలు తీయండి. లేకపోతే తమిళ డైరెక్టర్స్ ను చూసి నేర్చుకోండి.. అంటూ కామెంట్ చేశాడు. దానికి హరీష్ శంకర్.. ప్రస్తుతం దేశమంతా మన తెలుగు దర్శకుల వైపు చూస్తోంది. మీరు కూడా తమిళ ప్రేక్షకుల్ని చూసి నేర్చుకోండి బ్రో.. అంటూ కౌంటర్ ఇచ్చారు.  ప్రస్తుతం హరీష్ శంకర్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.