టీటీడీ చరిత్రలోనే అతిపెద్ద స్కాం జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు తిరుక్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షుడు తుమ్మ ఓంకార్. శ్రీవారి ఆస్తులను అమ్మేయాలని కొందరు చూస్తున్నారని అన్నారు. గురువారం ( ఫిబ్రవరి 26 ) మీడియాతో మాట్లాడుతూ ఈమేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు ఓంకార్.
టీటీడీ ఆస్తులు అన్యా క్రాంతం కాకుండా చూడాలని.. టీటీడీ టెండర్ షాపులను మానవతా దృక్పథంతో 40 ఏళ్లుగా కొనసాగించడం దారుణమని అన్నారు.
40 ఏళ్లుగా ఎలాంటి టెండర్లు నిర్వహించకుండా అ షాపులను ఎలా కొనసాగిస్తారని ప్రశ్నించారు.టిటిడి ఆస్తులను కాపాడే దిశగా అధికారులు అడుగులు వెయ్యాలని డిమాండ్ చేశారు ఓంకార్.వచ్చే పాలక మండలిలో దీనిపై ప్రధాన ఎజెండాగా చర్చ జరపాలని.. లేనింపక్షంలో హిందు భక్తులతో కలిసి నిరసనకు దిగుతామని అన్నారు ఓంకార్. ఈ సమావేశంలో శివకామేశ్వరి పీఠం పీఠాధిపతి శివానంద స్వామి కూడా పాల్గొన్నారు.
