తిరుమల ఘాట్ రోడ్డులో అదుపుతప్పి పిట్టగోడను ఢీకొన్న బైక్.. ఒకరు మృతి..

తిరుమల ఘాట్ రోడ్డులో అదుపుతప్పి పిట్టగోడను ఢీకొన్న బైక్.. ఒకరు మృతి..

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొదటి ఘాట్ రోడ్డులో బైక్ అదుపుతప్పి పిట్టగోడను ఢికొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గురువారం ( ఫిబ్రవరి 26 ) జరిగిన ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..

తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని 30వ మలుపు దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుమల నుండి తిరుపతికి వెళ్తున్న బైక్ అదుపుతప్పి పిట్టగోడను ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు తమిళనాడుకు చెందిన నటరాజన్ గా గుర్తించారు పోలీసులు. ఈ ఘటనలో గాయపడ్డ మురళి అనే వ్యక్తిని స్విమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రమాదానికి అతి వేగమే కారణమని ప్రాధమికంగా నిర్దారించినట్లు తెలిపారు పోలీసులు. స్థానికుల ఫిర్యాదుతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.