హైదరాబాద్ వాసులకు అలర్ట్.. శుక్రవారం (ఫిబ్రవరి 27) నుంచి ఈ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. శుక్రవారం (ఫిబ్రవరి 27) నుంచి ఈ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్  వాసులకు సిటీ పోలీసులు బిగ్ అలర్ట్ ప్రకటించారు.  శుక్రవారం (ఫిబ్రవరి 27) నుంచి  బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2 లో ఫ్లైఓవర్, అండర్ పాస్ పనులు ప్రారంభం అవుతున్నట్లు తెలిపారు. దీంతో ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని - సిటీ పోలీసులు తెలిపారు.

ఫ్లైఓవర్, అండర్ పాస్ పనులు  ముగిసే  వరకు ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని చెప్పారు. ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా వాహనదారులు ముందుగానే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని సూచించారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2 నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్  వెళ్లే వాహనదారులు ప్రత్యానయ మార్గాలు ద్వారా వెళ్ళాలని ట్రాఫిక్ అడ్వైజరీ విడుదల చేశారు. 

ప్రత్యామ్నాయ మార్గాలు, ట్రాఫిక్ మళ్లింపులు:

NFCL నుంచి వచ్చే ట్రాఫిక్: శ్రీనగర్ కాలనీ టీ-జంక్షన్, సాగర్ సొసైటీ (ముగ్ధ), కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, రోడ్ నెంబర్ -36- 45, కేబుల్ బ్రిడ్జ్ వైపు వెళ్లే వారు.. శ్రీనగర్ కాలనీ టీ-జంక్షన్, సాగర్ సొసైటీ వద్ద మళ్లింపు తీసుకోవాలి. శ్రీనగర్ కాలనీ మెయిన్ రోడ్, ఇందిరానగర్ లేబర్ అడ్డా, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ -5, వెంకటగిరి ఎక్స్‌రోడ్స్ మీదుగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ చేరుకోవచ్చు.

జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36- 45 నుంచి వచ్చే ట్రాఫిక్: NFCL వైపు వెళ్లే వారు.. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, వెంకటగిరి రోడ్ నెంబర్-2, యూసుఫ్ గూడ బస్తీ, యూసుఫ్ గూడ చెక్ పోస్ట్, మైత్రీవనం, అమీర్‌పేట్ మీదుగా ఇందిరానగర్ లేబర్ అడ్డా, శ్రీనగర్ కాలనీ, పంజాగుట్ట మెయిన్ రోడ్ వైపు వెళ్లవచ్చు.

KCP - బంజారాహిల్స్ రోడ్ నెంబర్ -1 నుంచి వచ్చే వారు: కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు వెళ్లే వారు.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్-10 మీదుగా క్యాన్సర్ హాస్పిటల్ వద్ద ఎడమకు తిరిగి, అగ్రసేన్ ఐలాండ్, భారతీయ విద్యాభవన్ మీదుగా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్- 45 వైపు వెళ్లవచ్చు.

మాసబ్ ట్యాంక్ నుంచి వచ్చే వారు: కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు వెళ్లే వారు.. విరించి హాస్పిటల్ (1/12) వద్ద ఎడమకు తిరిగి, అగ్రసేన్ ఐలాండ్, భారతీయ విద్యాభవన్ మీదుగా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్- 45 వైపు వెళ్లవచ్చు.

వాహనదారులకు సూచనలు:

సాధ్యమైనంత వరకు రద్దీ సమయాల్లో (ఉదయం 8:30 నుంచి11:00, సాయంత్రం 5:00 నుంచి 9:00) ఈ మార్గాల్లో ప్రయాణించవద్దు.

ట్రాఫిక్ పోలీసులు ఇచ్చే సూచనలు, సైన్ బోర్డులను అనుసరించాలి.

తాజా ట్రాఫిక్ అప్‌డేట్స్ కోసం నావిగేషన్ యాప్స్ (Google Maps మొదలైనవి) ఉపయోగించాలి.

ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ప్రజారవాణా లేదా కార్ పూలింగ్ (Car Pooling) కు ప్రాధాన్యత ఇవ్వాలి.

భారీ వాహనాలు రద్దీ సమయాల్లో ఈ మార్గాల్లో ప్రయాణించవద్దు.

తాజా సమాచారం కోసం మా సోషల్ మీడియా వేదికలు (Facebook: facebook.com/HYDTP, Twitter/X: @HYDTP) అనుసరించాలి. ప్రయాణంలో ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే మా ట్రాఫిక్ హెల్ప్‌లైన్ 9010203626 కు కాల్ చేయగలరు.

హైదరాబాద్ పౌరులందరూ ఈ ట్రాఫిక్ డైవర్షన్స్ గమనించి, తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు.