T20 World Cup: చెన్నైలో ఎవరూ తగ్గలే.. ఇండియా వీర బాదుడు: జింబాబ్వే టార్గెట్ 257

T20 World Cup: చెన్నైలో ఎవరూ తగ్గలే.. ఇండియా వీర బాదుడు: జింబాబ్వే టార్గెట్ 257

టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 రౌండ్‎లో భాగంగా జింబాబ్వేతో జరిగిన మ్యాచులో బ్యాటింగ్‏లో టీమిండియా దుమ్మురేపింది.  గురువారం చెన్నైలోని చిదంబరం మైదానం వేదికగా జరిగిన ఈ మ్యాచులో ఫామ్ లేమితో సతమతమవుతోన్న యంగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ (55) అర్ధ సెంచరీతో తిరిగి గాడిన పడగా.. చివర్లో హార్ధిక్ పాండ్య (50), తిలక్ వర్మ (44) మెరుపులు మెరిపించారు. 

సంజు శాంసన్ (24), ఇషాన్ కిషన్ (38), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (33) కూడా రాణించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా 256 పరుగుల భారీ స్కోర్ చేసింది. జింబాబ్వే బౌలర్లలో సికిందర్ రజా, మఫాసా, ముజరాబానీ తలో వికెట్ తీశారు. అనంతరం జింబాబ్వే 257 పరుగుల లక్ష్యంతో ఛేధనకు దిగింది.

ఈ మ్యాచులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియాకు అదిరిపోయే ఆరంభం దక్కింది. రింకు స్థానంలో జట్టులోకి వచ్చిన సంజు శాంసన్ (24) ధనాధన్ ఇన్సింగ్స్ ఆడాడు. ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతోన్న స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ (30 బంతుల్లో 55, 4 ఫోర్లు, నాలుగు సిక్సర్లు) కంబ్యాక్ ఇచ్చాడు. 

ఈ మ్యాచులో ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్కు దిగిన ఇషాన్ (38) కూడా క్రీజులో ఉన్నంత సేఫు పరుగుల వర్షం కురిపించాడు. ఇక, స్లోగా బ్యాటింగ్ చేస్తున్నారంటూ విమర్శలు ఎదుర్కొంటున్న కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడ్డారు. 

స్కై కేవలం 13 బంతుల్లోనే మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 33 రన్స్ చేసి ఔట్ కాగా.. తిలక్ 16 బంతుల్లో మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు కొట్టి 44 రన్స్ చేశాడు. ఇక, చివర్లో స్టార్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా గ్రౌండ్‎లో సిక్సర్ల వర్షం కురిపించాడు. 23 బంతుల్లో 2 ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివర్లో తిలక్, పాండ్యా శివాలెత్తి ఆడటంతో టీమిండియా వరల్డ్ కప్ హిస్టరీలోనే తమ తొలి అత్యధిక స్కోర్ (256) నమోదు చేసింది.