Anchor Suma: మీ డాన్స్ చూసి చచ్చిపొమ్మంటారా..సుమక్క స్టెప్పులకు నవ్వాగదు అంతే!

Anchor Suma: మీ డాన్స్ చూసి చచ్చిపొమ్మంటారా..సుమక్క స్టెప్పులకు నవ్వాగదు అంతే!

సుమ కనకాల(nchor Suma Kanakala)..17 ఏళ్లుగా స్టార్ యాంకర్గా కొనసాగుతున్నారు. ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ అయినా, టాక్‌ షో అయినా, స్పెషల్ ప్రోగ్రాం అయినా సుమ ఉండాల్సిందే.ఆమె పంచులు కామెడీ టైమింగ్‌కు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అంతటి క్రేజ్‌ సంపాదించుకున్న సుమ..తాజాగా ఒక స్పెషల్ వీడియో చేసి అభిమానులను ఆకట్టుకుంది.

ప్రస్తుతం ప్రభుదేవా లేటెస్ట్ రీల్ ఒకటి సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. ఆ రీల్‌ను రీ క్రియేట్ చేయాలని సుమ అండ్ టీం ప్రయత్నించింది.ఈ వీడియోకు అన్ ప్రొఫెషనల్ డ్యాన్సర్స్ అనే ట్యాగ్ ఇస్తూ..చిరు దాయి...దాయి....దామా స్టెప్ ను జతచేసింది.దీంతో సుమ ఫ్యాన్స్ ప్రభుదేవా 2.O గా వీడియో భలే వచ్చింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. 

అయితే,ఈ వీడియో చూసిన వారంతా సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. మధ్యలో ఇంద్ర మూవీ లో దాయి...దాయి....దామా స్టెప్ ఎందుకు వచ్చింది అక్క..అంటూ కొందరు చేస్తుంటే..'ప్రభుదేవా మీ డ్యాన్స్ చూస్తే చచ్చిపోతారేమో అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. సుమక్క మీ డాన్స్ చూసి చచ్చిపొమ్మంటారా..అంటూ ఇలా ఫన్నీ కామెంట్స్ తో హుషారు పెంచుతున్నారు. 

యాంకర్ సుమ  ఓ పక్క టీవీ షోస్,సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లలో పాల్గొంటూనే.. యూట్యూబ్ ఛానెల్ ద్వారా తన టాలెంట్ ను నిరూపించుకుంటూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు.పుట్టింది కేరళలోనే అయినా తెలుగు భాషను స్పష్టంగా మాట్లాడుతూ.. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ కు అనతికాలంలోనే మరింత చేరువయ్యారు.