
ఎప్పుడు నార్మల్ గా నవ్వుతూ కనిపించే అనుపమ(Anupama) యాంగ్రీ మోడ్ లోకి వెళ్లారు. తన గురించి, తన సినిమాల గురించి తప్పుడు ప్రచారం చేస్తున్న వెబ్ సైట్ కు చురకలు అంటించారు. ఇలాంటి బేస్ లెస్ న్యూస్ రాస్తున్న మీ గురించి జనాలకు తేలియాలంటూ సదరు వెబ్ సైట్ పై మండిపడ్డారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. అనుపమ పరమేశ్వరన్ సినిమాలు, ఆ సినిమాల్లో తన పాత్రల గురించి ప్రముఖ వెబ్ సైట్ తప్పుడు ప్రచారాలు చేస్తూ ఆర్టికల్స్ రాశారు.
అనుపమ గత రెండు సినిమాల్లో చాలా చిన్న పాత్రలు చేశారని. అందులో ఈగల్ ఒకటి అని, అదే కేవలం సైడ్ క్యారెక్టర్ అని. ఇక రెండో సినిమా తమిళ సైరన్ మూవీ అందులో ఆమె పాత్రకు కనీసం డైలాగ్స్ కూడా లేవని అలా పాత్రలో ఆమె ప్రస్తుతం నటిస్తున్నారు అంటూ అనుపమపై సెటైరికల్ న్యూస్ రాశారు. ఆ వార్తలు కాస్త అనుపమ వద్దకు చేరడంతో సదరు ఆర్టికల్ ను స్క్రీన్ షాట్స్ తీసి వెబ్ సైట్ కి పంపిస్తూ తప్ప్పుడు రాతలపై ఫైర్ అయ్యారు.
@GulteOfficial ?? pic.twitter.com/drcz21adM8
— Anupama Parameswaran (@anupamahere) February 22, 2024
సైరన్ సినిమాలో నాది మూగ, చెవిటి అమ్మాయి పాత్ర. మూగ ఆమ్మాయికి డైలాగ్స్ లేవు అని రాశారు అంటే మీరు చాలా గ్రేట్ అంటూ మెసేజ్ చేశారు. అనుపమ మెసేజ్ కు స్పందించిన సదరు వెబ్ సైట్.. సారీ ఎడిట్ చేస్తాము అంటూ రాసుకొచ్చారు. దానికి అనుపమ మళ్ళి స్పందింస్తూ.. ఈ స్క్రీన్ షాట్స్ ను జనాలకి తెలిసేలా చేస్తాను. మీరు ఎలాంటి తప్పుడు వార్తలు రాస్తున్నారో జనాలకి తెలియాలి అంటూ రాసుకొచ్చారు అనుపమ. అన్నట్టుగానే ఆ స్క్రీన్ షాట్స్ ను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన నెటిజన్స్ అనుపమపై ప్రశంసలు కురిపిస్తున్నారు.