ఫైనల్ గా సెట్ అయ్యింది.. చిరంజీవికి జోడీగా అనుష్క

ఫైనల్ గా సెట్ అయ్యింది.. చిరంజీవికి జోడీగా అనుష్క

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) 157వ సినిమా పై రోజుకో కొత్త న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బింబిసార ఫేమ్ వశిష్ట డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రెస్టీజియస్ సినిమాను.. యూవీ క్రియేషన్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. సోషియో ఫాంటసీ కథాంశంతో రానున్న ఈ సినిమాపై అనౌన్స్మెంట్ నుండే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇటీవలే ఈ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా మొదలైంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుకానుంది. 

ఇక తాజాగా ఈ ప్రాజెక్టు నుండి అదిరిపోయే న్యూస్ ఒకటి ఫిల్మ్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే.. ఈ సినిమాలో మెగాస్టార్ కు జోడీగా స్టార్ బ్యూటీ అనుష్కను తీసుకోనున్నారట. ఇదే విషయాన్ని చిరంజీవితో వద్ద ప్రస్తావించగా.. ఆయన కూడా ఒకే చెప్పినట్లు తెలుస్తుంది. ఈ విషయంఫై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుంది. 

Also Read :- చాలా సంతోషంగా ఉంది.. పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నిహారిక

ఇక చిరంజీవి, అనుష్క కాంబోలో సినిమా కోసం ఆడియన్స్ చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. ఈ జంట ఇప్పటికే స్టాలిన్ సినిమాలో ఒక సాంగ్ కనిపించారు. దీంతో ఈ కాంబో సెట్ అయ్యింది అనే న్యూస్ తెలిసి మెగా ఫ్యాన్స్ కూడా హ్యాపీ గా ఫీలవుతున్నారు. మరి ఈ రేంజ్ స్టార్ కాస్ట్ తో వస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ అవనుందో చూడాలి.