చాలా సంతోషంగా ఉంది.. పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నిహారిక

చాలా సంతోషంగా ఉంది.. పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నిహారిక

మెగా డాటర్ నిహారిక(Niharika) కొద్దీ రోజుల నుండి ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఈ మధ్య విడాకుల విషయంలో వార్తల్లో నిలిచిన నిహారిక.. ప్రస్తుతం తన సోషల్ మీడియా పోస్టుల ద్వారా కూడా ట్రెండ్ అవుతున్నారు. ఇక ఇటీవలే తన ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెకేషన్ కు వెళ్లారు నిహారిక. దీనికి సంబందించిన ఫోటోలను తన సోషల్ మీడియా వేదికగా తన ఫ్యాన్స్ తో పంచుకున్నారు.   

ఇక తాజాగా నిహారిక చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. మా ఫ్యామిలీ అంతా ఇటీవల కెన్యాకు వెళ్లాం. చాలా రోజుల నుండి కెన్యాకు వెకేషన్ కు వెళ్లాలని అనుకుంటున్నాం. అది ఇప్పటికి కుదిరింది. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసే టైం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. వెకేషన్ తరువాత వాళ్లు ఇండియా వెళ్లిపోయారు కానీ.. నేను అమెరికాకి వచ్చాను. ఎందుకంటే..

Also Read :- త్వరలో కీర్తి సురేష్, అనిరుధ్ పెళ్లి.. స్పందించిన ఆమె తండ్రి

ప్రస్తుతం నా చేతిలో కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒక సినిమాకు కూడా ఓకే చెప్పాను. కాబట్టి 20 రోజులు బ్రేక్ కోసం అమెరికాకు వచ్చాను. ఇక అన్నయ్య పెళ్లి గురించి చెప్పాలంటే.. పెళ్లి ఎక్కడ అనే విషయం ఇంకా ఫైనలైజ్ కాలేదు. పెళ్లి పనులు ఉన్నాయ్ త్వరగా వచ్చేయ్ అని అన్నయ్య ఫోన్ చేస్తున్నాడు. ఇక లావణ్య గురించి చెప్పాలంటే.. తను మా అన్నయ్యతో ప్రేమలో పడకముందే నాకు మంచి ఫ్రెండ్. వాళ్లిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్.. అంటూ చెప్పుకొచ్చింది నిహారిక.