త్వరలో కీర్తి సురేష్, అనిరుధ్ పెళ్లి.. స్పందించిన ఆమె తండ్రి

త్వరలో కీర్తి సురేష్, అనిరుధ్ పెళ్లి.. స్పందించిన ఆమె తండ్రి

గత కొంతకాలంగా  సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మహానటి(Mahanati) కీర్తి సురేష్(Keerthi suresh) పెళ్లి గురించే చర్చ జరుగుతోంది. త్వరలో ఆమె పెళ్లి చేసుకోబోతుంది అంటూ, ఆమెకు కాబోయే వరుడు ఇతడే అంటూ చాలా వార్తలే వైరల్ అవుతున్నాయి. వాటికి కీర్తి సురేష్ తల్లి మేనక(Menaka) కూడా క్లారిటీ ఇచ్చారు. దాంతో ఆ వార్తలకు చెక్ పడింది అనుకున్నారంతా. కానీ తాజగా మరోసారి కీర్తి సురేష్ పెళ్లి వార్తలు తెరపైకి వచ్చాయి. 

అయితే ఈసారి వరుడు మరెవరో కాదు.. ప్రస్తుతం తన మ్యూజిక్ తో ఇండియా మొత్తని ఊపేస్తున్న అనిరుద్ రవిచందర్. అవును వీళ్ళిద్దరూ చాలా కాలంగా డేటింగ్ లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకొని ఒకటి కాబోతున్నారని ఆ వార్తల సారాంశం. ఈ వార్తలు కీర్తి ఫ్యామిలీ వరకు చేరడంతో.. ఈ వార్తలపై కీర్తి తండ్రి స్పందించారు. ఈ విషయం పై ఆయన మాట్లాడుతూ.. కీర్తి సురేష్, అనిరుధ్ పెళ్లిపై వస్తున్న వార్తల్లో నిజం లేదు. అవన్నీ రూమర్స్. వాటిని నమ్మకండి. కావాలనే ఎవరో ఇలాంటి వార్తలను సృష్టిస్తున్నారు. ఇందులో ఏమాత్రం నిజం లేదు.. అంటూ చెప్పుకొచ్చారు ఆయన అంటూ క్లారిటీ ఇచ్చారు.