వాస్తు శాస్త్రం ప్రకారం .. నిద్రపోయేటప్పుడు తల ఏ దిక్కులో ఉండాలి.. మెట్ల కింద బాత్రూం ఉంటే నష్టాలొస్తాయా..! ఏ దిక్కుకు తిరిగి వంట చేయాలో .. వాస్తు శాస్త్రంలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం. . !
ప్రశ్న: నిద్రపోయేటప్పుడు తలను ఏ దిక్కుకు పెట్టాలి? మా ఇంట్లో అందరూ మామూలుగా దక్షిణానికే తల పెట్టి పడుకుంటారు. అయితే ఇప్పుడు ఇంట్లో కొన్ని మార్పులు చేశాం. దాంతో మంచాన్ని వేరే చోటుకి జరిపాం. ఇప్పుడు తలలు ఉత్తరం లేదా పడమర దిక్కుకు పెట్టాల్సి వస్తోంది. అసలు అలా పడుకోవడని, ఆరోగ్యం చెడిపోతుందని కొందరు అంటున్నారు? అది నిజమేనా?
జవాబు: రాత్రిళ్లు నిద్రపోయేటప్పుడు మంచం లేదా నేల ఎక్కడైనాసరే ఉత్తరం దిక్కుకు తల పెట్టి పడుకోవద్దు. ఆ ఒక్క దిక్కు తప్ప మిగిలిన తూర్పు, పడమర, దక్షిణం వైపుకు తల పెట్టుకుని నిద్రపోవచ్చు. ఇప్పుడు మీకు రెండే దారులు అన్నారు కాబట్టి ఉత్తరం కాబట్టి ఉత్తరం పదిలేసి పడమరకు తల పెట్టి పడుకోండి. ఎలాంటి సమస్యలూ రావు.
ప్రశ్న: మాది వరంగల్ జిల్లా. రెండు నెలల క్రితమే హైదరాబాద్ కు వచ్చి ఒక ఇంట్లో అద్దెకు దిగాం, కొత్తింట్లో దక్షిణం దిక్కుకు ముఖం పెట్టి వంట చేయాల్సి వస్తోంది కానీ తెలిసిన వాళ్లందరూ ఆ దిక్కును చూస్తూ వంట చేయొద్దు అని చెబుతున్నారు. అలా చేస్తే నిజంగా దోషాలుంటాయా? అంతా మంచే జరగాలంటే, ఏదిక్కును చూస్తూ వంట చేస్తే మంచిది?
జవాబు: నిప్పుకు అధిపతి అగ్నిదేవుడు. కాబట్టి వంటగది సూర్యుడు ఉదయించే దిక్కు అంటే తూర్పువైపుకు ఉంచాలి. అది ఆగ్నేయ మూల ఉండాలి. వంట చేసే వాళ్లెప్పుడూ తూర్పు దిక్కుకు తిరిగి వంట చేయాలి. సూర్యరశ్శి వంటగది నుంచి ఇంట్లోకి వ్యాపించడం వల్ల సుఖసంతోషాలు కలుగుతాయి. అలా కుదరకపోతే వాయువ్యంలో కట్టి పడమర దిక్కును వాడొచ్చు. ఈ రెండూ కాకుండా ఏ విధంగా చేసినా అనారోగ్యం. భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి. వ్యవహారం విడాకుల దాకా వెళ్లే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వంటగదిని మార్చుకోవడమో వేరే ఇంటిని చూసుకోవడమో చేయండి..!
ప్రశ్న: మొన్నటి వరకూ అద్దె ఇంట్లో ఉండేవాళ్లం. ఈ మధ్యే అరవై గజాల స్థలంలో రెండు గదులు కట్టిన ఇంటిని కొన్నాం. అక్కడ మెట్ల కిందే బాత్రూమ్ కట్టారు. అలా ఉంటే మంచిది కాదని విన్నాను. ఇప్పుడు మేము బాత్ రూము వేరే చోట కట్టుకోవాలా? ఒకవేళ అలా చేయాల్సి వస్తే ఏ మూలకు పెడితే మంచిది. ఇప్పుడిప్పుడే ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాం. మళ్లీ వాస్తు దోషాలు వస్తే భరించలేం. మా సమస్యకు పరిష్కారం చెప్పండి.
జవాబు: బాత్రూమ్ ఎక్కడ ఉండాలన్న విషయంలో ఎప్పుడూ సందేహాలు ఉంటూనే ఉంటాయి. చాలామంది మెట్ల కింద బాగా వృథా అవుతుందని, అక్కడ బాత్రూమ్ కడతారు. కానీ అసలు మెట్ల కింద బాత్రూమ్ ఉండకూడదు. అందులో గుంట, నీళ్లు ఉంటాయి కాబట్టి వాటిపై నుంచి నడవకూడదు. అలా ఉంటే ఆ ఇంట్లో వాళ్లకు ఏది చేసినా కలిసిరాదు. వాస్తు ప్రకాశం వాయవ్యం, ఆగ్నేయంలో ఉంటే అంతా మంచే జరుగుతుంది. నైరుతిలో గొయ్యిలు ఉండకూడదు. అలాంటప్పుడు బాత్రూమ్ ఆ మూల ఉంటే అన్ని రకాల సమస్యలు వస్తాయి.
