Sakshi Vaidya: పవన్ కళ్యాణ్ సరసన క్రేజీ ఆఫర్.. అదృష్టమంటే 'మురారి' బ్యూటీదే!

Sakshi Vaidya: పవన్ కళ్యాణ్ సరసన క్రేజీ ఆఫర్.. అదృష్టమంటే 'మురారి' బ్యూటీదే!

'ఏజెంట్' మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ముంబై  బ్యూటీ సాక్షి వైద్య. అయితే బాక్సాఫీస్ వద్ద వరుస పరాజయాలతో ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల 'నారీ నారీ నడుమ మురారి'తో కమ్ బ్యాక్ ఇచ్చింది. ఇప్పుడు ఈ బ్యూటీకి మరోసారి అదృష్టం తలుపు తట్టింది. ఈ అమ్మడు ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త  వైరల్ అవుతుంది.

పవన్ సరసన సాక్షి వైద్య!

దర్శకుడు సురేందర్ రెడ్డి, పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో ఒక భారీ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. జైత్ర రామ మూవీస్ (Jaithra Rama Movies) బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును ఈ ఏడాది ప్రారంభంలోనే అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా కాస్టింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇందులో ఇద్దరు కథానాయికలకు చోటు ఉండగా, ఒక హీరోయిన్‌గా సాక్షి వైద్యను దాదాపు ఖరారు చేసినట్లు ఫిల్మ్ నగర్ లో  జోరుగా టాక్ వినిపిస్తోంది..

సురేందర్ రెడ్డి నమ్మకం.. 

సాక్షి వైద్య ఇదివరకు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'ఏజెంట్' సినిమాలో నటించింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా, సాక్షి పనితీరు, ఆమె క్రమశిక్షణ సురేందర్ రెడ్డికి బాగా నచ్చాయట.  సాక్షికి తెలుగు రాకపోయినా, తన డైలాగులను ఇంగ్లీషులో రాసుకుని ఎంతో స్పష్టంగా చెప్పేదట. ఆమె అంకితభావం చూసి ఇంప్రెస్ అయిన దర్శకుడు, పవన్ కళ్యాణ్ సినిమాలో ఆమెకు కీలక పాత్ర ఇచ్చేందుకు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఇటీవల శర్వానంద్‌తో కలిసి నటించిన 'నారీ నారీ నడుమ మురారి' చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 35 కోట్లకు పైగా వసూళ్లతో సూపర్ హిట్ సాధించింది. ఈ విజయంతో సాక్షికి టాలీవుడ్‌లో మంచి డిమాండ్ ఏర్పడింది.

పవర్ స్టార్ లైనప్

పవన్ కళ్యాణ్ నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' మార్చి 26న రిలీజ్ కానుంది. సురేందర్ రెడ్డి సినిమా ఉగాది తర్వాత పట్టాలెక్కే అవకాశం ఉంది. ఈ సినిమాలో సాక్షి పాత్ర చాలా విభిన్నంగా ఉండబోతుందని టాక్.  పవన్ కళ్యాణ్ వంటి బిగ్ స్టార్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆమె కెరీర్‌కు మలుపు తిప్పే అవకాశం ఉందని సినీ వర్గాలు అవకాశం ఉంది. గతంలో వరుణ్ తేజ్, అఖిల్ అక్కినేని వంటి యంగ్ హీరోలతో నటించిన సాక్షికి..  ఇప్పుడు పవర్ స్టార్ సరసన అవకాశం రావడం ఆమె ఫ్యాన్స్‌కు ఖుషీ ఇచ్చే వార్తే. ఈ ప్రాజెక్టుపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.