Suhas: చిన్న పాత్ర అని పిలిచి అవమానించారు.. సుహాస్ ఎమోషనల్ స్పీచ్!

Suhas: చిన్న పాత్ర అని పిలిచి అవమానించారు.. సుహాస్ ఎమోషనల్ స్పీచ్!

 టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మొదలై, ఇప్పుడు మినిమం గ్యారెంటీ హీరోగా ఎదిగిన నటుడు సుహాస్. ప్రస్తుతం 'హే బల్వంత్' మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శివాని నాగారం హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 20వ తేదీన థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. కామెడీ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

అయితే తాజాగా ఈ మూవీ ఈవెంట్ లో తన కెరీర్ మొదట్లో ఎదురైన ఒక చేదు అను భవాన్ని గుర్తుచేసుకున్నాడు సుహాస్. కెరీర్ తొలినాళ్లలో అవకాశాల కోసం తిరుగుతున్నప్పుడు, ఒక పెద్ద సినిమాలో హీరోయిన్ కు క్లోజ్ ఉండే క్యారెక్టర్ ఉందని పిలిచారు. తీరా అక్క డికి వెళ్ళాక ఆ పాత్ర గురించి వివరించిన తీరు, నేను చూసిన విధానం చాలా అవమానకరంగా అనిపించింది అని చెప్పుకొచ్చారు.. 

ఆ క్షణం బాధ అనిపించినా, నా కష్టంపై నమ్మకంతో ముందడుగు వేశానని చెప్పారు సుహాస్. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అన్నట్టుగా.. ఒకప్పుడు హీరోయిన్ పక్కన చిన్న రోల్ కోసం పిలిచి అవమానించిన ఇండస్ట్రీలో, ఇప్పుడు అదే స్టార్ హీరోయిన్ పక్కన సమానమైన గుర్తింపు ఉన్న పాత్రలో నటించా అని చెప్పాడు. ఈ పరిణామం సుహాస్ అభిమానులకు ఎంతో స్పూర్తినిచ్చింది. వరుస హిట్స్ తో దూసుకెళ్తున్న ఈ యంగ్ హీరో ఫిబ్రవరి 20వ రిలీజ్ అవుతున్న  'హే బల్వంత్' తో ఎలాంటి రికార్డు సృష్టిస్తాడో చూడాలి మరి.