OTT Thriller: మూఢనమ్మకాల మర్మం.. ఓటీటీలోకి వచ్చేస్తోన్న తెలుగు హార్రర్ థ్రిల్లర్

OTT Thriller: మూఢనమ్మకాల మర్మం.. ఓటీటీలోకి వచ్చేస్తోన్న తెలుగు హార్రర్ థ్రిల్లర్

క్రైమ్ & హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఓటీటీ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే, ఉత్కంఠభరితమైన కథనం, సస్పెన్స్ అంశాలు ప్రేక్షకులను చివరి వరకు ఎంగేజ్ చేస్తుంటాయి. అందుకే ప్రతి వారం వచ్చే కొత్త థ్రిల్లర్ సినిమాల కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా ఓ కొత్త హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అదే ఈషా (EESHA).

‘రాజు వెడ్స్ రాంబాయి’ ఫేమ్ అఖిల్ రాజ్, త్రిగుణ్ హీరోలుగా నటించిన ఈ చిత్రంలో హెబ్బా పటేల్ హీరోయిన్‌గా కనిపించింది. శ్రీనివాస్ మన్నె డైరెక్ట్ చేసిన ఈ హారర్ థ్రిల్లర్ డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలైంది. సాధారణంగా హారర్ థ్రిల్లర్ చిత్రాల్లో డ్రామాటిక్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే, ఈ సినిమా మాత్రం రియలిస్టిక్ టచ్‌తో తెరకెక్కి ప్రేక్షకులకు భిన్నమైన అనుభూతిని కలిగిస్తుంది.

ఆత్మలు, మూఢనమ్మకాల నేపథ్యంలో సాగిన ఈ మూవీ, ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను భయపెట్టేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ Amazon Prime Video లో ఈ చిత్రం స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది. ప్రస్తుతం విదేశాల్లో మాత్రమే ప్రసారం అవుతుండగా, మన దేశంలో ఈ శుక్రవారం నుంచి అందుబాటులోకి రానుంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Thri gun (@thrigun_aactor)

ఈషా కథ విషయానికి వస్తే.. 

కల్యాణ్, నయన, అపర్ణ, వినయ్ అనే నలుగురు ఫ్రెండ్స్. దెయ్యాలు, ఆత్మలు లేవని వీరు బలంగా నమ్ముతుంటారు. ఈ క్రమంలో వీరు ఓ  టీమ్‌గా ఏర్పడి దొంగ బాబాలు, స్వామిజీల బండారాల్ని బట్టబయలు చేస్తుంటారు. అలా ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఉంటున్న ఆదిదేవ్ (బబ్లూ పృథ్వీరాజ్) బాబా గురించి వీళ్లకు ఓ సమాచారం తెలుస్తుంది. ఎలాగైనా అతడి బాగోతం కూడా బయటపెట్టాలని ఫిక్స్ అవుతారు.

అలా వీరు అనుకున్నట్టుగానే ఆ ఆదిదేవ్ బాబాని కలుస్తారు. ఆత్మల విషయంలో ఈ నలుగురికి బాబా ఓ ఛాలెంజ్ విసురుతాడు. ఇంతకీ ఆ బాబా విసిరిన సవాలు ఏంటి? దాన్ని వల్ల వారు ఎలాంటి చిక్కుల్లో పడ్డారు? చివరికి ఏం తెలుసుకున్నారు? ఈ నలుగురిని చంపాలనుకుంటున్న పుణ్యవతి ఎవరు? ఇంతకీ ఆదిదేవ్ అసలు క్యారెక్టర్ ఎలాంటిది? అనేదే తెలియాలంటే మూవీ చూడాల్సిందే!!