టాలీవుడ్ బ్యూటీస్ అనుపమ పరమేశ్వరన్, రెజీనా కసాండ్రా, నటుడు విరాజ్ అశ్విన్ లీడ్ రోల్స్‌లో నటించిన సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ ‘మరీచిక’. మే 29, 2026న థియేటర్లలోకి వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమ్ అవుతుంది. సినిమా విడుదలకు ముందు భారీ అంచనాలు పెంచుకున్న ‘మరీచిక’.. థియేటర్లో మాత్రం ఆశించిన సక్సెస్ అందుకోలేకపోయింది.
అయినప్పటికీ, సస్పెన్స్‌తో నిండిన కథనం, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, మాస్ట్రో ఇళయరాజా అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఇప్పుడు డిజిటల్ వేదికపైకి వచ్చిన ఈ చిత్రం.. ఓటీటీ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.
#Mareechika (Telugu)
— OTT Trackers (@OTT_Trackers) June 19, 2026
Now streaming on PrimeVideo in Telugu & Tamil 🍿!!#OTT_Trackers pic.twitter.com/zjxsplI2Kp
కథేంటంటే?
సంజు (విరాజ్ అశ్విన్) ఓ స్టైలిష్ కెఫే రన్ చేస్తుంటాడు. మనోడిని చూసి లోలోపలే పీకల్లోతు ప్రేమలో మునిగిపోతుంది కాలేజ్ స్టూడెంట్ వెంకటలక్ష్మి (అనుపమ). కానీ, ఆ ప్రేమను బయటపెట్టడానికి తెగ సతమతమవుతుంది. ఈ గ్యాప్‌లో లండన్ నుంచి వచ్చిన ఎన్‌ఆర్‌ఐ బ్యూటీ మరీచిక (రెజీనా)తో వెంకటలక్ష్మికి ఫ్రెండ్‌షిప్ అవుతుంది. లక్ష్మి ద్వారానే సంజు, మరీచికల పరిచయం కాస్తా పెళ్ళి దాకా వెళ్తుంది.
అంతా హ్యాపీ అనుకునేలోపే.. ఊహించని ట్విస్ట్! సంజును మరీచిక దారుణంగా హత్య చేస్తుంది. కళ్లెదుటే జరిగిన ఈ మర్డర్ చూసి షాకైన లక్ష్మి పోలీస్ స్టేషన్‌కు పరుగులు తీస్తుంది. అసలు మరీచిక ఎవరు? ప్రాణంగా ప్రేమించిన సంజును ఎందుకు చంపేసింది? ఈ మిస్టరీ వెనుక ఉన్న అసలు నిజాలు ఏంటి? అనేది మిగతా కథ.
ఎలా ఉందంటే:
‘మరీచిక’ అంటే ఎండమావి, భ్రమలు అని అర్థం. అందుకు తగ్గట్టుగానే ఒక పాత్రకు మరో పాత్రతో సంబంధం ఉంది అన్నట్టుగా ఒకసారి, అసలు అలాంటి వ్యక్తే లేరు అన్నట్టుగా మరోసారి చూపించిన విధానం సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ మూడు పాత్రలు చెప్పే విషయాల్లో ఏది నిజం, ఏది కల్పితం అనే ట్విస్టులతో ఎమోషన్స్, మిస్టరీ అంశాలు సైకలాజికల్ థ్రిల్ ఫీలయ్యేలా చేస్తుంది. ఐడియా పరంగా మహేష్ బాబు ‘వన్: నేనొక్కడినే’ వైబ్స్ గుర్తుకు తెస్తుంది.
►ALSO READ | Transfer Trimurthulu Review: 10 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన వడ్డే నవీన్.. ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’తో మెప్పించాడా?
డైరెక్టర్ సతీష్ కాసెట్టి ఎంచుకున్న థాట్ బాగున్నా, కథనం లోనే అసలు ట్విస్ట్ పడింది. ఫస్టాఫ్ చాలా నెమ్మదిగా, కాస్త పేషెన్స్‌ను టెస్ట్ చేసేలా సాగుతుంది. లవ్ స్టోరీలో ఉండాల్సిన కెమిస్ట్రీ గానీ, ఎమోషన్ గానీ సరిగ్గా పండలేదు. అయితే, ఇంటర్వెల్ బ్లాక్ నుంచి సినిమా అసలైన ట్రాక్ ఎక్కుతుంది. సెకండాఫ్ లో వచ్చే ట్విస్టులు, క్లైమాక్స్ లో అజయ్ ఘోష్, రెజీనా, అనుపమల మధ్య వచ్చే కన్ఫ్యూజన్ డ్రామా కాస్త నవ్విస్తూ, ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తాయి. మొత్తానికి
