ఫిఫా వరల్డ్ కప్ 2026లో గెలిస్తే ఒక్కొక్కరు ఒక్కో రకంగా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ, మెక్సికోకు చెందిన ఒక ఫుట్‌బాల్ అభిమాని మాత్రం తన పిచ్చిని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాడు. తమ టీమ్ వరల్డ్ కప్ నాకౌట్ స్టేజ్‌కు చేరడంతో ఆ ఆనందం తట్టుకోలేక ఏకంగా ఒక దూదిపిండి (కాటన్ క్యాండీ) మిషన్‌లో తన తల దూర్చేశాడు. ప్రస్తుతం ఈ వింత సెలబ్రేషన్ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.
మెక్సికో సూపర్ విక్టరీ:
ఐకానిక్ అజ్టెకా స్టేడియంలో జరిగిన గ్రూప్-A చివరి మ్యాచ్‌లో మెక్సికో 3-0 తేడాతో చెకియా (Czechia) పై ఘనవిజయం సాధించింది. గ్రూప్ స్టేజ్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ (సౌతాఫ్రికా, సౌత్ కొరియా, చెకియా లపై) గెలిచి, పూర్తి పాయింట్లతో మెక్సికో గ్రూప్-A లో టాప్ ప్లేస్ కొట్టింది. దాంతో రౌండ్ ఆఫ్ 32 (నాకౌట్) కు అర్హత సాధించింది. టీమ్ ఇంత సాలిడ్ ఫామ్‌లో ఉండటంతో స్టేడియంలో ఉన్న వేలాది మంది అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
షుగరీ వోల్ఫ్‌మ్యాన్:
ఈ అద్భుత విజయంతో ఊగిపోయిన ఒక మెక్సికన్ ఫ్యాన్.. స్టేడియం బయట ఉన్న కాటన్ క్యాండీ మిషన్‌లోకి నేరుగా తన తలను దూర్చేశాడు. ఆ మిషన్ నుండి అతను బయటకు తీసేసరికి, అతని తల, ముఖం అంతా గులాబీ రంగు దూదిపిండితో నిండిపోయింది. దీనిని చూసిన నెటిజన్లు అతన్ని షుగరీ వోల్ఫ్‌మ్యాన్ (చక్కెర తోడేలు) అని పిలుస్తూ రకరకాల మీమ్స్‌తో ఆడుకుంటున్నారు. గ్రూప్ స్టేజ్ గెలిస్తేనే తల దూర్చాడు.. అదే మెక్సికో గనుక కప్పు కొడితే ఇంకేం చేస్తాడో? అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.
A Mexican fan celebrated his team in the most unusual style. 🇲🇽😳 pic.twitter.com/nhSym790m0
— World Cup HQ (@WorldCup26HQ) June 25, 2026
