తమిళ స్టార్ కమెడియన్ యోగి బాబు ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సోషియో-పొలిటికల్ కామెడీ డ్రామా ‘కెనతా కాణోమ్’(Kenatha Kanom) థియేటర్లలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం ఇవాళ (జూన్ 16) నుంచి జియోహాట్‌స్టార్‌లో తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సోషియో-కామెడీ డ్రామాలో నీటి సమస్య, బావుల తవ్వకం వంటి అంశాలను హాస్యంతో కూడిన కథాంశంగా తెరకెక్కించారు.
తీవ్రమైన కరువుతో అల్లాడుతున్న ఓ గ్రామంలో తాగునీటి కోసం చేసే ప్రయత్నం ఊహించని మలుపు తిరుగుతుంది. బావి తవ్వుతుండగా 66 మిలియన్ల ఏళ్ల నాటి డైనోసార్ అస్థిపంజరం బయటపడటంతో గ్రామం మొత్తానికి కొత్త సమస్యలు మొదలవుతాయి. దర్శకుడు సురేష్ సంగయ్య ఆలోచింపజేసే కథనం, ఆకట్టుకునే కామెడీతో రావడంతో సినిమాకి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీ ఆడియన్స్ను ఆకట్టుకుంటూ ట్రెండ్ అవుతోంది.
Ponnu paaka pora feeling'ae thani pa.. 😍#KenathaKanom now streaming only on #JioHotstar #KenathaKanomOnJioHotstar #KenathaKanomNowStreaming #KenathaKanomOnJHS #JioHotstarTamil @iYogiBabu @LovelynChand @RaichalRabecca #ActorRamakrishnan @sureshsangaiah @Thiyagudop1… pic.twitter.com/OImZD0x8XT
— JioHotstar Tamil (@JioHotstartam) June 21, 2026
కథేంటంటే:
తమిళనాడులోని రామనాథపురం జిల్లా పరిధిలోని ఒక మారుమూల గ్రామం అది. గ్రామంలో వర్షాలు లేని కారణంగా నీటి సమస్య తీవ్రంగా ఉంటుంది. ఆడవాళ్లు చాలా దూరం నుంచి మంచి నీళ్లు తీసుకురావడానికి అవస్థలు పడుతుంటారు. ఆ గ్రామంలో మణివసాగర్ (యోగిబాబు), తన తాత త్యాగితో కలిసి నివసిస్తూ ఉంటాడు. వాళ్ల తాత ఒక వైపున గుడిలో పూజారిగా ఉంటూనే, మిగతా టైంలో శిల్పిగాను పనిచేస్తుంటాడు.
►ALSO READ | TOXIC: వాయిదాల పరంపరకు ఫుల్ స్టాప్.. ‘టాక్సిక్’ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్..
అయితే, లక్ష్మీ అనే అమ్మాయి మణిని ఇష్టపడుతుంది. కానీ, ఆ ఊరి సమస్య గురించి తెలిసిన ఆమె తండ్రి వాళ్లకు పెండ్లి చేయడానికి ఒప్పుకోడు. ఇలా ఉండగా తమ ఊళ్లో నీటి జాడలు ఎక్కడ ఉన్నాయనేది ఆ గ్రామస్తులు ఒక వ్యక్తికి చూపిస్తారు. మణి ఇంటిముందు నీళ్లు పడతాయని ఆ వ్యక్తి చెప్తాడు. దాంతో మణికి లక్ష్మినిచ్చి పెళ్లి చేయడానికి ఆమె తండ్రి ఒప్పుకుంటాడు. అందరూ కలిసి మణి వాకిట్లో బావి తవ్వడం మొదలుపెడతారు. అలా కొంతలోతు తవ్విన తరువాత డైనోసార్ అస్థిపంజరం బయటపడుతుంది. ఈ విషయం మీడియాలో వైరల్ అవుతుంది. దాంతో సీన్లోకి ఆఫీసర్స్ ఎంట్రీ ఇస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? అనేది మిగతా కథ.
ఎలా ఉందంటే:
యోగి బాబు పోషించిన మణివాసగం పాత్ర తనదైన హాస్యంతో, చురుకైన సంభాషణలతో ప్రేక్షకులను అలరిస్తాడు. పెళ్లిళ్లు కుదిర్చే బ్రోకర్, నీటి సమస్య కారణంగా సంబంధాన్ని తిరస్కరించే వధువు కుటుంబం, అప్పుగా ఇచ్చిన కొబ్బరికాయలపై గొడవపడే పొరుగువారు వంటి పాత్రలు సినిమాకు సహజత్వాన్ని తీసుకొచ్చాయి. ఇక పురావస్తు శాఖ జోక్యం, గ్రామాన్ని రక్షిత ప్రాంతంగా ప్రకటించడం వంటి పరిణామాలతో కథ మరింత ఆసక్తికరంగా సాగుతుంది. కథనం కొంత ఊహించదగ్గ విధంగా ఉన్నప్పటికీ, నివాస్ కె. ప్రసన్న సంగీతం, గ్రామీణ నేపథ్యంలో సాగే హాస్య సన్నివేశాలు సినిమాకు బలంగా నిలిచాయి. మొత్తంగా ‘కెనతా కాణోమ్’ ఓ ఆహ్లాదకరమైన గ్రామీణ కామెడీ డ్రామాగా ప్రేక్షకులను అలరిస్తుంది.
