TOXIC: వాయిదాల పరంపరకు ఫుల్ స్టాప్.. ‘టాక్సిక్’ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్..

TOXIC: వాయిదాల పరంపరకు ఫుల్ స్టాప్.. ‘టాక్సిక్’ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్..

కన్నడ స్టార్ హీరో యష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘టాక్సిక్’. వాయిదాల మీద వాయిదాలతో ముందుకు వెళ్తూ ఫ్యాన్స్ ని డిస్సపాయింట్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే విడుదల తేదీపై నెలల తరబడి కొనసాగిన ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 26, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుందని యష్ అధికారికంగా ప్రకటించారు. “తండ్రిని గౌరవించండి.. #Toxic ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 26, 2026 నుంచి థియేటర్లలో” అని రిలీజ్ క్యాప్షన్ ఇచ్చారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణతో కలిసి యశ్ కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

వచ్చేనా? మళ్లీ వాయిదా పడుతుందా?

మొదట ఈ సినిమాను 2025 ఏప్రిల్ 10న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే నిర్మాణం, షూటింగ్‌లో ఎదురైన జాప్యాల కారణంగా దాదాపు ఏడాది పాటు వాయిదా పడింది. అనంతరం ఈద్, గుడి పడ్వా, ఉగాది పండుగలను దృష్టిలో ఉంచుకుని 2026 మార్చి 19న విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే ఇరాన్-అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చిత్ర విడుదలను మరోసారి వాయిదా వేసినట్లు మేకర్స్ తెలిపారు. దీంతో తాజాగా ఆగస్టు 26, 2026ను కొత్త విడుదల తేదీగా ఖరారు చేశారు. మరి ఇప్పుడైన కరెక్ట్ టైంకి వస్తుందా? లేదో చూడాలి. 

►ALSO READ | Allu Arjun: ‘నా తండ్రే నా దైవం’.. చాగంటి గొంతుతో అల్లు అర్జున్ ఎమోషనల్ వీడియో

బాక్సాఫీస్ రేంజ్‌ డబుల్.. 

గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ చిత్రంలో యష్ సరసన నయనతార, హుమా ఖురేషి, కియారా అద్వానీ, తారా సుతారియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌ సినిమాపై భారీ అంచనాలు పెంచింది. ఇక పలుమార్లు వాయిదా పడిన టాక్సిక్ ఈసారి మంచి బాక్సాఫీస్ డేట్ని సెలెక్ట్ చేసుకుంది.

ఆగస్టు 26న ఓణం, ఈద్-ఎ-మిలాద్ వంటి పండుగలు ఉండటంతో పాటు రక్షాబంధన్ వీకెండ్ కూడా కలిసి రావడం ‘టాక్సిక్’ బాక్సాఫీస్ రేంజ్‌ను మరింత పెంచుతుందని అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం కోసం యష్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో తెరకెక్కించగా.. తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో డబ్ వెర్షన్లు కూడా విడుదల కానున్నాయి.