Vastu tips : గృహప్రవేశం తరువాత ఇల్లు ఖాళీగా ఉండొచ్చా.. పురాతన కోట పక్కన ఇంటి నిర్మాణంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..!

Vastu tips :  గృహప్రవేశం తరువాత ఇల్లు ఖాళీగా ఉండొచ్చా.. పురాతన కోట పక్కన ఇంటి నిర్మాణంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..!

ఇంట్లో ప్రతిది వాస్తు ప్రకారమే ఉండాలి.. అంతేకాదు ఇంటి నిర్మాణం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..   ఇల్లు గృహప్రవేశం తర్వాత ఖాళీగా ఉండవచ్చా..కోట పక్కన స్థలంలో గృహ నిర్మాణ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ...మొదలగు విషయాల గురించి వాస్తు కన్సల్టెంట్​  కాశీనాథుని శ్రీనివాస్​ గారు ఏమంటున్నారో చూద్దాం...

ప్రశ్న: ఉమ్మడి కుటుంబంతో కలిసి పెద్ద ఇంట్లో ఉంటున్నాం. అయితే కొంత క్రితం వేరే ఇల్లు కట్టుకుని, గృహప్రవేశం చేసి ఖాళీగా వదిలేశాం. కొత్తగా కట్టుకున్న ఇల్లును చాలాకాలం ఖాళీగా వదిలేయడం వల్ల ఏదైనా దోషం ఉంటుందా?

జవాబు: ఇంటిని అలా వదిలేయడం మంచిది కాదు. ఇంట్లో ఏదోషాలు ఉండకూడదు.  రోజూ వెళ్లి, దైవానికి దీపారాధన చేసి రావాలి. నిత్యం ఇలా చేస్తే దోషాలు తగ్గుతాయి.


ప్రశ్న: పాత కోట పక్కన ఖాళీస్థలం ఉంది. ఆ స్థలానికి దగ్గర్లో ఒక పాత బావి ఉంటే కొన్నేళ్ల క్రితం పూడ్చేశారు. ఆ ప్రదేశానికి దగ్గర్లో ఉన్న ఖాళీ స్థలంలో ఇల్లు కట్టుకోవచ్చా?

జవాబు : కోట పక్కన స్థలం చతురస్రాకారంలో ఉంటే. ఇల్లు కట్టుకోవడంలో ఎలాంటి దోషం లేదు. అయితే పూడ్చేసిన పురాతన బావి పైన ఇల్లు కట్టుకోకూడదు. ఇటువంటి చోట వాస్తు కచ్చితంగా ఫాలో కావాలి.