ఎవరినీ లైట్ తీసుకోకండి.. ఐర్లాండ్ దెబ్బతో శ్రేయస్ అయ్యర్ మైండ్‌బ్లోయింగ్ కామెంట్స్!

ఎవరినీ లైట్ తీసుకోకండి.. ఐర్లాండ్ దెబ్బతో శ్రేయస్ అయ్యర్ మైండ్‌బ్లోయింగ్ కామెంట్స్!

Shreyas Iyer: భారత జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. అలాగే ఇండియా టీ20 కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌కు తొలి మ్యాచ్‌లోనే ఓటమిని చవిచూశాడు. బెల్‌ఫాస్ట్‌ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్‌ సేన 34 రన్స్ తేడాతో ఐర్లాండ్ చేతిలో ఓడిపోయింది. మ్యాచ్ అనంతరం శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్ ఓడినప్పటికీ కెప్టెన్‌గా ఇది ఒక గొప్ప ఆరంభమని పేర్కొన్నాడు.

మధ్యలో ఆటపై పట్టు సడలించాం: 
మ్యాచ్ స్టార్టింగ్ లో మా బౌలర్లు బాగా బౌలింగ్ చేశారని అనుకుంటున్నాను అని కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్‌ తెలిపారు. వారు లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేశారు.. అలాగే రెండు వికెట్లని కూడా తీసుకున్నారు.. దాంతో మాకు అద్భుతమైన ఆరంభం లభించింది. కానీ మధ్యలో మేము ఆటపై కాస్త పట్టు వదిలేసినట్లు అనిపించింది. మా ఇన్నింగ్స్ ఆరంభం కూడా చాలా మంచిగానే స్టార్ట్ అయింది.. కానీ మధ్యలో వరుసగా వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్‌ని చేజార్చుకోవల్సి వచ్చిందని అయ్యర్ అన్నాడు. 

ఎవరినీ లైట్ తీసుకోకండి: 
ఎవరినీ లైట్ తీసుకోకండి.. ఎందుకంటే.. విజయం అనేది మనకు అంత సులువుగా దొరకదు.. కష్టపడితేనే గెలుపు వరిస్తుందని భారత కెప్టెన్ శ్రేయస్ పేర్కొన్నాడు. గతంలో ఏం జరిగిందన్న విషయంతో సంబంధం లేకుండా.. ప్రస్తుతంలో జీవించడం ముఖ్యం.. ప్రత్యర్థిని కట్టడి చేసే అవకాశం లభిస్తే.. ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలి పెట్టకూడదు.. ఇక్కడ వాళ్లు 140 రన్స్ చేయడం గొప్పే అనిపించింది. కానీ వారిని మేము కట్టడి చేయలేకపోయాం.. ఇలాంటి పిచ్‌లపై మరిన్ని మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.. అప్పుడే వికెట్‌పై మాకు కొంచెం అవగాహన వస్తుందన్నాడు. ఏదేమైనా కెప్టెన్‌గా నాకిది గొప్ప ఆరంభమేనని శ్రేయస్‌ వెల్లడించాడు.